Ads
మహిళలకు, బంగారంకు మధ్య విడదీయరాని బంధం ఉందని అంటారు. వివాహాలు, శుభకార్యాలు, వేడుకలు, పండగలు ఇలా ఏదైనా ప్రత్యేక సందర్భాలలో బంగారం కొనుగోలు చేయాలని మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
Video Advertisement
పెద్దలు కూడా సురక్షితమైన పెట్టుబడి అంటే బంగారమే అని చెబుతుంటారు. అయితే బంగారం కొనుగోలు విషయంలో చాలా మంది నాణ్యత విషయంలో మోసపోతుంటారు. దాని కోసం భారత ప్రభుత్వం హాల్‌మార్కింగ్ ను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ కొందరు మోసం చేస్తున్నారు. హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
బంగారం ఖరీదు ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. ఎంత రేటు పెరిగినప్పటికీ, బంగారం కొనుగోళ్లు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. బంగారం నాణ్యత విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మోసపోవాల్సి ఉంటుంది. బంగారం నాణ్యతను హాల్‌మార్క్ ద్వారా గుర్తించవచ్చు. హాల్ మార్క్ అంటే, ధృవీకరించబడిన బంగారం. విలువైన లోహంతో తయారుచేసిన వస్తువులో ఆ లోహం అనేది ఎంత శాతం ఉందో ఖచ్చితంగా నిర్ధారించిన తరువాత, అధికారికంగా స్టాంప్ వేయడాన్నే హాల్‌మార్కింగ్ అని అంటారు.
ఇది బంగారానికి సైతం వర్తిస్తుంది. హాల్ మార్కింగ్ విలువైన లోహపు వస్తువుల స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (BIS) బంగారు వస్తువు యొక్క స్వచ్ఛతను మరియు క్వాలిటీని ధృవీకరించడానికి హాల్‌మార్క్ లైసెన్స్ ఇస్తుంది. 22 క్యారెట్ల అయితే 22K916, 18 క్యారెట్ల అయితే 19K750, 14 క్యారెట్ల అయితే 14K585 గుర్తులు ఉంటాయి. హాల్ మార్కింగ్ పై బంగారం స్వచ్ఛత నంబర్, తయారీ సంవత్సరం కూడా ఉంటాయి.అలా ఇచ్చినప్పటికి కొందరు మోసం చేస్తూనే ఉన్నారు. అలాంటి అప్పుడు బంగారం నాణ్యమైనదో కాదో ఎలా తెలుసుకోవాలి అంటే బీఎస్ఐ కేర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని, దానిలో హాల్‌మార్క్ నెంబర్ ఎంటర్ చేసినపుడు ఆ వస్తువు ఎన్ని క్యారెట్స్ అనేది చూపిస్తుంది. దాని ద్వారా మీరు కొన్నబంగారు వస్తువు నాణ్యత ఏమిటో తెలుస్తుంది.
Also Read: టెలికాం దిగ్గజం అయిన BSNL ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి..? ఇలా చేసి ఉండకపోతే..?
End of Article