Ads
అర్థశాస్త్ర రచయిత, రాజనీతిజ్ఞుడు అయిన చాణుక్యుడు ప్రతి విషయం లో ఎలా నడుచుకోవాలో వివరిస్తూనే ఉన్నాడు. ఆయన చాణక్య నీతిని రచించి నేటికీ దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆయన వాక్యాలు సదా ఆచరణీయాలుగానే ఉంటున్నాయి. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి.. చాణక్యుడు చెప్పిన విషయాల ప్రకారం పురుషుడు మగువల మనసు గెలవాలంటే ఈ మూడు పనులు చేసేటప్పుడు అస్సలు భయపడకూడదని చెప్పాడు. ఇంతకీ అవేంటో చూద్దాం.
Video Advertisement
1. మీరు ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే.. తప్పకుండా వారికి మీ ప్రేమను వ్యక్తీకరించాలి. ఆమెకు కూడా మీపై ఇష్టం ఉన్న పక్షం లో ఆలస్యం చేయడం తగదు. భయపడి వెనకడుగు వేస్తె.. సమయం వృధా అయిపోవచ్చు మీరు చెప్పేలోపు ఏమైనా జరగొచ్చు. మీ భయం ఆమెపై మీకున్న ప్రేమని పోగొట్టేస్తుంది. అందుకే మీ ప్రేమను వ్యక్తపరచడానికి అస్సలు భయపడకూడదు.
ఇక పెళ్లి అయిన తరువాత, హనీమూన్ కి వెళ్ళినప్పుడు భయపడి సిగ్గుపడుతూ కూర్చోకూడదు. భార్య ముందు సిగ్గు పడుతూ కూర్చుంటే.. ఆమెకు మీపై గౌరవం ఉండదు. ఆమెనుంచి ప్రేమను పొందడానికి.. ఆమెకు ప్రేమను ఇవ్వడానికి ఎప్పుడు సందేహించకూడదు. అలాగే.. పురుషులు మరొక వివాహిత స్త్రీని అస్సలు ప్రేమించకూడదు. దానివలన ఇతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
2. పురుషులకు కూడా దుఃఖం, పేదరికం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే.. వీటిని తలచుకుని బాధపడుతూ ఉండకూడదు. ఇలాంటి విషయాలలో ఎంత భయపడితే అంత నష్టం కలుగుతుంది. అందుకే భయపడకుండా ముందుకు సాగాలి.
3. లోపల మీరు బలహీనంగా ఉన్నా.. ఆ విషయాన్నీ పదే పదే ప్రదర్శించవద్దు. ఎందుకంటే.. మీ భార్య మీపై నమ్మకాన్ని పెట్టుకుని బతుకుతుంటుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా తన భర్త తనను ఆడుకుంటాడని భావిస్తుంది. మీ బలహీనతను వ్యక్తం చేస్తూ ఉండటంవలన ఆమెకు ఆ నమ్మకం పోయే అవకాశం ఉంటుంది. ఈ మూడు అంశాల్లోనూ భయపడకుండా ముందుకు సాగితే.. మీ భార్యకు మీరే హీరో గా ఉంటారు.
End of Article