భార్య భర్తల బంధం అనేది ఎంతో సున్నితంగా ఉంటుంది. ఒకరిపట్ల ఒకరికి మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మాత్రమే వారి వైవాహిక జీవితం సుఖంగా సాగిపోతుంది. అలాకాకుండా ఒకరిపై ఒకరికి చులకన భావన ఏర్పడినప్పుడు ఆ బంధానికి స్వస్తి చెప్పే ప్రమాదం ఎక్కువ ఉంది.
మరి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చులకనగా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి..? మీ పట్ల వారి ప్రవర్తనను మార్చుకోవాలంటే ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం..
#1.ఇష్టం:
మీరు ఎప్పుడైనా వారిని ఏ రెస్టారెంట్ అయిన తీసుకెళ్లినప్పుడు మీ జీవిత భాగస్వామికి ఇష్టమైనది ఏదో కనుక్కొని ఆర్డర్ చేయడం ద్వారా తన గురించి శ్రద్ధ తీసుకుంటున్నారనే అభిప్రాయం కలుగుతుంది.
#2. సంభాషణ :
మీరు ఏదైనా విలువైనవి కొనేటప్పుడు, అంటే ఇల్లు, కారు వంటివి తీసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామితో సంభాషించడం వలన మీరు వాళ్ళకి బాధ్యత లో కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని వాళ్లు గుర్తిస్తారు.
#3. వ్యక్తిగత విషయాలు :
ఉద్యోగం, చదువు, కెరీర్ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలను తీసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామితో సంభాషించుకోవాలి. వారు మీరు చేసే పని అర్థం చేసుకొని మీ పై ఉన్న చులకన భావం తగ్గుతుంది.
#4. నిజాయితీ :
మీరు చేసే పనిలో గాని, వ్యక్తిగతంగా గాని ఎలాంటి విషయంలోనైనా దాపరికం లేకుండా మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా చెప్పడం వలన వాళ్లకు మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని నిజాయితీగా నాతో పంచుకుంటున్నారు అనే భావనతో మీపై చులకనభావం తగ్గుతుంది.
#5. క్రమశిక్షణ :
సంపాదన, ఆదా, ఖర్చు అలాంటి వాటి విషయంలో క్రమశిక్షణగా ఉండడం అనేది మీ భాగస్వామికి మీ పై ఉండే చులకనభావం తగ్గిస్తుంది.
#6. దూరం:
అరగంటకు మించి ఎక్కువగా మాట్లాడడం అనేది జీవిత భాగస్వాముల మధ్య సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడప్పుడూ కుటుంబీకులతో కొన్ని రోజులు సంతోషంగా గడిపిరా అని చెప్పడం ద్వారా మీకు వాళ్ళ పై ఉన్న ప్రేమ అర్థం వేసుకుని చులకన భావం అనేది తగ్గుతుంది. అంతే కాకుండా మీకు మీ జీవితభాగస్వామి మధ్య దూరం ఉండటం ద్వారా ఆ విరహం అనేది ప్రేమగా మారుతుంది.
NOTE: Images used in the article and the featured image are just for representative purpose. But not the actual characters.