ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు ఈ చిన్న ట్రిక్ పాటిస్తే…చెప్పులు పోయే అవకాశమే లేదు.!

ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు ఈ చిన్న ట్రిక్ పాటిస్తే…చెప్పులు పోయే అవకాశమే లేదు.!

by Mohana Priya

Ads

జనాలు ఎక్కువ బస్సు ప్రయాణాల కంటే ట్రైన్ ప్రయాణం ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. జన సందోహం ఉన్న ప్రదేశాలలో ట్రైన్ వెళ్లదు కాబట్టి వాతావరణం కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలా మనం మనం ట్రైన్ ఎక్కినప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ట్రైన్ ని ఎక్కువ గమనించము. మన బెర్త్ తప్ప మిగిలినవి మనం పట్టించుకోము.

Video Advertisement

how to save footwear from stealing in train journeys
కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా, ఒకసారి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మన వస్తువుల్లో ఏదో ఒకటి పోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కొన్ని విలువైన వస్తువులు, అలాగే మనం తరచుగా వాడే వస్తువులు కూడా ఉంటాయి. వాటిలో ఫుట్‌వేర్ ఒకటి. మనకు వినడానికి వింతగా అనిపించినా కూడా, రైలు ప్రయాణాల సమయంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.how to save footwear from stealing in train journeys

పడుకునేటప్పుడు చెప్పులు కింద పెట్టేసి పడుకుంటే, తర్వాత లేచి చూసేటప్పటికీ అవి మాయం అయిపోతాయి. కొంత మంది ఈ కారణంగానే తక్కువ ధర చెప్పులు వేసుకొని ప్రయాణిస్తూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం ఖరీదైన చెప్పులు వేసుకుని ఉంటారు. సాధారణంగా చెప్పులు దొంగలించడం అనేది అరుదుగా జరుగుతుంది. ఒకవేళ చెప్పుల ధర తక్కువ అయితే పర్వాలేదులే కానీ ఎక్కువ కాస్ట్ అయితే మాత్రం జాగ్రత్తగానే ఉండాలి. ఏదైనా చెప్పులు లేకుండా నడవడం అనేది కష్టమైన పనే. ఇలా చెప్పులు పోకుండా ఉండడానికి మీరు ఒక చిట్కా పాటించవచ్చు. మీ చెప్పుల జతలో ఒక చెప్పుని ఒక బర్త్ కింద ఇంకొక చెప్పుని మీ ఎదురుగా కానీ, పక్కన కానీ బెర్త్ కింద పెట్టండి.

how to save footwear from stealing in train journeys

అలా చేస్తే మీ చెప్పు దొంగిలించడానికి వచ్చిన వాళ్ళు, ఒక చెప్పు మాత్రమే ఉండడంతో దొంగిలించకుండా అక్కడే పెట్టేసి వెళ్ళిపోతారు. ఆ సమయంలో చీకటిగా ఉంటుంది కాబట్టి దొరికిపోతావు అనే భయం ఉంటుంది కాబట్టి మిస్ అయిన ఇంకొక చెప్పు గురించి ఎక్కువ సేపు వెతకడానికి కూడా వారు ప్రయత్నించరు. “అసలు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా?” అని అనుకోకండి. ఈ విషయాన్ని స్వయంగా సమర్ మాథుర్ అనే ఒక కోరా యూజర్ తెలిపారు. తాను ఇదే ఐడియాని ప్రతి ట్రైన్ ప్రయాణంలో పాటిస్తున్నట్టు, అందుకే తను ట్రైన్ ప్రయాణంలో కూడా తన చెప్పులు కింద పెట్టేసి ధైర్యంగా నిద్రపోతున్నట్టు చెప్పారు.

Article sourced from: Quora


End of Article

You may also like