వాట్సాప్ లో ఈ చిన్న ట్రిక్ మీకు తెలుసా.? సీక్రెట్ గా స్టేటస్ చూసేయండి ఇలా.!

వాట్సాప్ లో ఈ చిన్న ట్రిక్ మీకు తెలుసా.? సీక్రెట్ గా స్టేటస్ చూసేయండి ఇలా.!

by Mohana Priya

Ads

ఒక్కొక్కసారి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాం అంటే, మెసేజెస్ కి రిప్లై ఇవ్వలేకపోతాం. అలా అని సోషల్ మీడియాకి దూరంగా ఉంటామని కాదు. అన్నీ రెగ్యులర్ గా చెక్ చేస్తూనే ఉంటాం. కానీ ఎవరితో కూడా చాట్ చేయలేం. అంతే. దానికి కారణం బిజీగా ఉండడం కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు. ఇప్పటికే చాలా మంది వాళ్లు చివరిగా వాట్సాప్ ఎప్పుడు ఓపెన్ చేశారో ఎవరికీ తెలియకుండా లాస్ట్ సీన్, అంటే మనం చివరిగా వాట్సప్ ఓపెన్ చేసిన టైం తీసేశారు.

Video Advertisement

కానీ అప్పుడప్పుడు వేరే వాళ్ల స్టేటస్ చెక్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు మనకి అంతకుముందు మెసేజ్ చేసి ఉంటే, మనం దానికి రిప్లై ఇవ్వకుండా ఉంటే, కానీ స్టేటస్ సీన్ లో మన పేరు ఉంటే. ఇంక అంతే సంగతులు. కానీ మనం ఎవరి స్టేటస్ అయినా చూస్తే, వాళ్ళకి మనం చూసిన సంగతి తెలియకుండా ఉండడానికి ఒక టెక్నిక్ ఉపయోగిస్తే చాలు. అదేంటంటే.

# వాట్సాప్ లో సెట్టింగ్స్ కి వెళ్ళండి. తర్వాత ఎకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయండి.

# ప్రైవసీ ఆప్షన్ క్లిక్ చేయండి.

# అందులో రీడ్ రిసిప్ట్ ఆన్ చేసి ఉంటే, ఆఫ్ చేయండి.

ఇలా చేస్తే మీరు ఎవరి మెసేజెస్ చూసినా, మీ మెసేజెస్ ఎవరైనా చూసినా బ్లూ టిక్స్ రావు. అప్పుడు స్టేటస్ చూసినా కూడా, మీరు చూసినట్టు వారికి తెలియదు. అంతే కాకుండా మీ స్టేటస్ ఎవరెవరు చూశారో అనేది మీకు కనిపించదు. ఒకసారి ప్రయత్నించి చూడండి.


End of Article

You may also like