Ads
నా పేరు సరిత. నేను ఒక ఐటీ ఎంప్లాయ్ ని. కరోనా కారణం గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటోంది. నా ఫ్రెండ్, ఇంకా కొలీగ్ ప్రియ ని కలిసి చాలా రోజులు అయిందని ఇవాళ కలుద్దాం అని అనుకున్నాం. నేను స్కూటీ మీద ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఈ మాస్క్ పెట్టుకొని డ్రైవ్ చేయడం చాలా చిరాకు గా ఉంది. అసలు మాస్క్, మళ్లీ హెల్మెట్. ఇలా రెండు మేనేజ్ చేయలేకపోయా. మధ్యలో మాస్క్ వల్ల గాలి ఆడట్లేదు. దాంతో మాస్క్ ని అడ్జస్ట్ చేసుకుంటూ అలానే డ్రైవ్ చేస్తూ ఎలాగో ఆలా ప్రియ వాళ్ళ ఇంటికి వచ్చాను.
Video Advertisement
ప్రియ : సరిత ఎలా ఉన్నావు?
నేను : నేను బాగున్నా ప్రియ.
ప్రియ : అసలు మనం ఆఫీస్ లో తప్ప ఇలా ఇంట్లో కలవడం ఇదే మొదటి సారి అనుకుంటా కదా!
నేను : అవును. మార్చ్ లో మన ఆఫీస్ లో చూసా నిన్ను. మళ్ళీ ఇపుడే చూడడం.
ప్రియ : అవునా. కానీ నేను మాత్రం నిన్ను రెండు, మూడు సార్లు వెజిటేబుల్ మార్కెట్ లో నువ్వు కూరగాయలు కొంటున్నపుడు చూసాను. నేను కూడా అదే మార్కెట్ కి కూరల కోసం వస్తూ ఉంటాను. కానీ నేను చూసిన ప్రతీ సారి నువ్వు మాస్క్ సరిగ్గా పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా నీ మాస్క్ నీ ముక్కు కవర్ అయ్యేలాగా పెట్టుకోలేదు.
నేను : అంటే అప్పుడు కూరల అతనితో మాట్లాడుతున్నా కదా. అందుకే మాస్క్ దించి మాట్లాడాను. ఇప్పుడు కూడా డ్రైవ్ చేసేటప్పుడు అసలు గాలి ఆడలేదు అందుకే మాస్క్ అడ్జస్ట్ చేసుకున్నా.
ప్రియ : ఇప్పుడు బయట అస్సలు బాలేదు సరిత. వైరస్ ఎక్కడ నుంచి వ్యాపిస్తుంది అనే విషయం కూడా చెప్పలేము. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి. నువ్వే కాదు చాలామంది కూడా మాస్క్ ముక్కు కవర్ అయ్యేలాగా వేసుకోవడం లేదు. అది చాలా తప్పు. ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ సరిగ్గా వేసుకోకపోతే, ఒకవేళ వాళ్ళకి తెలియకుండా వైరస్ వ్యాపిస్తే, అది వాళ్లతో పాటు ఇంట్లో వాళ్లకు కూడా సోకే అవకాశం ఉంటుంది.
దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇవి మాత్రమే కాకుండా నోటి తుంపర ద్వారా కూడా వైరస్ వ్యాపించే అవకాశం ఉందట. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. తరచుగా వాడే మాస్క్ ఎలాస్టిక్ లూజ్ అయిపోతే, మాస్క్ మార్చేయాలి. అలాగే మన మాస్క్ ఇతరులతో షేర్ చేసుకోకూడదు. అంతేకాకుండా మాస్క్ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మాస్క్ ముక్కు నోరు కవర్ అయ్యేలాగా ధరించాలి. ఇంకా పదే పదే మాస్క్ ని కూడా
తాకొద్దు అట. మాస్క్ తీసేటప్పుడు మాస్క్ కి ఉన్న ఎలాస్టిక్ లేదా తాడును పట్టుకుని మాస్క్ ని తొలగించాలట.
Note: Images Used in this article are just for reference purpose but not the exact characters.
End of Article