Ads
ఎప్పుడు రైళ్లు ఆలస్యంగానే వస్తూ ఉంటాయి. టైం కి రైళ్లు రావని మనం తిట్టుకుంటూ ఉంటాము. గంటల తరబడి రైళ్లు ఆలస్యంగా వస్తూ ఉంటాయి. రైలు ఆలస్యం అయితే ఏం చేస్తాం స్టేషన్ లో కూర్చుని ఎదురు చూడటం తప్ప. ఒక్కొక్కసారి రైళ్లు గంట నుంచి మూడు నాలుగు గంటలు ఆలస్యంగా వస్తే మరి కొన్ని సార్లు రైళ్లు ఏకంగా 20 గంటలు వరకు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి.
Video Advertisement
అలాంటి సమయంలో మనం ప్రయాణం మొదలు పెడితే వెళ్లాల్సిన దానికంటే చాలా ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటాము.
అయితే 20 గంటలు ఆలస్యంగా నడిచినా కూడా సరైన సమయానికి రైలు ఎలా స్టార్ట్ అయ్యిందో మీకు తెలుసా..? దాని గురించి ఇప్పుడు చూద్దాం. న్యూ ఢిల్లీ లక్నో మధ్య ప్రయాణించే రైలు నంబర్ 02004 స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ న్యూ ఢిల్లీ నుండి ఉదయం 6 గంటల 10 నిమిషాలకు మొదలవుతుంది. అది లక్నో కి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 12:45 అవుతుంది.
తిరిగి అదే ట్రైన్ లక్నో నుండి 15:35 కి వెళ్ళాలి. అప్పుడది 10:20 కి ఢిల్లీ వెళుతుంది. ఒకవేళ ఈ ట్రైన్ రెండు గంటలు ఆలస్యం అయితే 12:45 కి లక్నో చేరుకోకుండా 02:45 కి లక్నో చేరుకుంటుంది. ఆ తర్వాత 15:35 కి ట్రైన్ ని క్లీన్ చేసి పంపిస్తారు.
లక్నో నుండి న్యూఢిల్లీకి వెళ్లేటప్పుడు ఆలస్యమైతే… ఢిల్లీ నుండి లక్నో కి మళ్ళీ వెళ్లడానికి సమయానికి బయలుదేరడానికి ఇంకా సమయం ఉంటుంది. ఇదిలా ఉంటే సుదూర రైళ్ళకి ఎక్కువ రేక్ లు ఉంటాయి. కనుక ట్రైన్ ఆలస్యంగా వచ్చినా మరో రేక్ సరైన సమయంలో తిరిగి రావడానికి రెడీగా ఉంటుంది. ఎక్కువ దూరం వెళ్లే రైళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ వుంది.
End of Article