రైలు టర్నింగ్ ఎలా తిరుగుతుంది.?

రైలు టర్నింగ్ ఎలా తిరుగుతుంది.?

by Mounika Singaluri

Ads

రైలు ప్రయాణం చేయటం చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ట్రైన్ జర్నీ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నిజానికి కిటికీ పక్క సీట్ లో కూర్చుని చక్కగా చెట్ల ని ఆ ప్రకృతిని చూస్తే సమయమే తెలియదు. అయితే రైలు కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వున్నాయి.

Video Advertisement

మామూలుగా రైలు పట్టాల మీద నుండి వెళ్తున్నప్పుడు చక్కగా టర్నింగ్ తీసుకుంటూ ఉంటుంది అయితే రైలు టర్నింగ్ ఎలా తీసుకుంటుంది అనేది చాలా మందికి తెలియదు. మరి రైలు ఎలా పడిపోకుండా టర్నింగ్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.

ట్రాక్ మీద నుండి వెళ్లే రైలు కరెక్ట్ గా టర్నింగ్ ఎలా తీసుకుంటుంది..? అయితే మనం రైలు ఉండే చక్రాలను సరిగ్గా గమనించి చూసినట్లయితే చక్రాలు కోన్ ఆఖారం లో కనబడతాయి అంటే దీనికి అర్థం ఒక వైపు డయామీటర్ ఎక్కువ ఉంటుంది మరొక వైపు డయామీటర్ తక్కువగా ఉంటుంది.

రెండు చక్రాలు కూడా ఒకే రాడ్ కి కనెక్ట్ అయి ఉంటాయి. దీనితో ఒకే స్పీడ్ తో తిరగడం జరుగుతుంది. అయితే టర్నింగ్ వచ్చినప్పుడు రెండు చక్రాలు కూడా పట్టాల మీద ఉండి బాలెన్స్డ్ గా ఉండాలి లేక పోతే రైలు తిరగబడి పోతుంది. కానీ టర్నింగ్ వచ్చినప్పుడు రైలు పడిపోకుండా వెళ్తుంది.

ఇది చక్రం యొక్క ఆకారం మీద ఆధారపడి ఉంది. ఇందాక చెప్పినట్టు చక్రం కొని ఆకారం లో ఉంటుంది. అయితే కోన్ ఆకారం లో ఉండడం వలన ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పట్టాల వైపు ఎక్కువ డయామీటర్ ఉన్న చక్రం వెళుతుంది. తక్కువ పొడవున్న పట్టాల పైన తక్కువ డయామీటర్ వుండే చక్రం ఉంటుంది దీని మూలం గానే రైలు పడిపోకుండా వెళ్ళగలదు. టర్నింగ్ ని తీసుకోగలదు. లేదంటే ట్రైన్ పట్టాల మీద సరిగ్గా వెళ్ళలేదు.


End of Article

You may also like