బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చెయ్యక్కర్లేని వ్యక్తి హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్‌.. పంచ్‌లతో ఆడియన్స్‌ను నవ్వించడంలో ఆది స్టైలే వేరు. షో ఏదైనా.. స్టేజీ ఎక్కడైనా.. ఆది ఉన్నాడంటే కామెడీ పండాల్సిందే. జబర్దస్త్ ద్వారా ఏందో మంచి గుర్తింపు పొందిన ఈయన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. అప్పుడప్పుడు ఆది కొన్ని వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు కానీ ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

Video Advertisement

 

 

అయితే జబర్దస్త్‌ కార్యక్రమం నుండి ఇటీవల హైపర్ ఆది తప్పుకున్న విషయం తెల్సిందే. హైపర్ ఆది మధ్య లో ఒక సారి తప్పుకున్నాడు. ఆ సమయంలో ఆది తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి కనీసం ఆరు నెలలు కూడా కాకుండానే మళ్లీ జబర్దస్త్‌ లో కనిపించకుండా ఆది వెళ్లి పోయాడు. ప్రస్తుతం ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఢీ డాన్స్ షో లో కనిపిస్తున్నాడు. అంటే మల్లెమాల వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. మళ్లీ హైపర్ ఆది మళ్లీ జబర్దస్త్‌ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ చాలా మంది బలంగా నమ్ముతున్నారు.

hyper aadi quits jabardasth again..??

మరో వైపు ఆది జబర్దస్త్ కి దూరం కావడానికి కారణం సినిమాల్లో బిజీ కావడమేఅని తెలుస్తోంది. ఈ మధ్య కాలం లో ఆది చాలా పెద్ద సినిమాల్లో కనిపిస్తున్నాడు. అతడికి సినిమా అవకాశాలు కూడా బాగా పెరిగాయి. మొత్తానికి ఆది షో లు కాకుండా.. సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు అంటున్నారు. అయితే జబర్దస్త్ కి కంటెంట్ రాయడానికి, స్కిట్స్ ప్రాక్టీస్ కి టైం కేటాయించలేకపోవడం వల్లే ఆది జబర్దస్త్ కి దూరం అయ్యాడు అని తెలుస్తోంది.

hyper aadi quits jabardasth again..??

కానీ ఆయన అభిమానులు మాత్రం జబర్దస్త్‌ లో మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. హైపర్ ఆది ని మల్లెమాల వాళ్ళు పక్కన పెట్టారు అంటూ వచ్చిన వార్తలు నిజం కాదని క్లారిటీ వచ్చేసింది.హైపర్ ఆది, రైజింగ్ రాజు టీం సుదీర్ఘ కాలంగా జబర్దస్త్ లో కొనసాగుతోంది. జబర్దస్త్‌ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుధీర్ తో కలిసి కూడా ఎన్నో స్కిట్లు హైపర్ ఆది చేసారు. ఇక జబర్దస్త్ కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా హైపర్ ఆది కి మంచి పేరు తెచ్చింది. అయితే ఆది తిరిగి జబర్దస్త్ కి తిరిగి రావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.