హైపర్ ఆది గారు నిజంగా “వినాయక చవితి” కథ అర్ధం చేసుకొని ఉంటే… అలాంటి స్కిట్స్ చేయరు అనుకుంటా.?

హైపర్ ఆది గారు నిజంగా “వినాయక చవితి” కథ అర్ధం చేసుకొని ఉంటే… అలాంటి స్కిట్స్ చేయరు అనుకుంటా.?

by Sainath Gopi

Ads

వినాయక చవితి అనగానే చంద్రుడిని చూడొద్దు అనే కథ గుర్తొచ్చి ఉంటది. చిన్నప్పటినుండి వింటూనే ఉన్నాము. కానీ ఆ కథ నుండి ఏం నేర్చుకుంటున్నాము అనేది ముఖ్యము. కొద్దిసేపు ఈ కథ గురించి పక్కన పెడితే జబర్దస్త్ గురించి మాట్లాడుకుందాము. గురు, శుక్ర వారాలు రాత్రి 9:30 చాలామంది తెలుగు ఇళ్లల్లో ఇదే షో మోగుతూ ఉంటుంది.

Video Advertisement

ఆ షోలో హైపర్ ఆది స్కిట్ గురించి మాట్లాడాలి అంటే “బాడీ షేమింగ్” తప్ప ఇంకేమి గుర్తు రాదు. లావు గా ఉన్నారు అని గణపతి గారి మీద పంచ్ లు, సన్నగా ఉన్నారని శాంతి స్వరూప్ మీద పంచులు. వయసు గురించి చెప్తూ ముసలోడు అంటూ రాజు గారి మీద పంచ్ లు. ఇలా లావుగా, సన్నగా, నల్లగా ఉన్నారు అనే పంచ్ లు తప్ప ఇంకేమి ఉండదు. ఇలా ఒక స్కిట్ కాదు. మొదటి నుండి అన్ని స్కిట్స్ లో ఇదే ఫార్ములా.

ఒక మనిషి లోని లోపాన్ని ఎత్తి చూపకుండా కామెడీ పండించలేరా జబర్దస్త్ ఆర్టిస్ట్ లు.?
అలా అనుకుంటే ఒకసారి “అమృతం” సీరియల్ గుర్తుతెచ్చుకోండి. ఎంత సాఫ్ట్ కామెడీ ఉంటుందో. ఎవరిని కించపరచుకుందా ఉంటుంది.  అయితే ఈ జబర్దస్త్ కి వినాయక చవితి కథకి సంభందం ఏంటి అనుకుంటున్నారా.? ఆ కథ తెలిసే ఉంటుంది మీ అందరికి. కానీ ఒకసారి మళ్ళీ గుర్తుచేసుకుందాము.

Vinayaka Chavithi Vratham:

Vinayaka Chavithi Vratham:

భక్తుడైన గజాసురుడు పరమశివుడిని తన ఉదరం లో ఉంచుకుంటాడు కదా.. అతనిని విడిపించడానికి విష్ణువు గంగిరెద్దు నాటకం ఆడతాడు. ఎట్టకేలకు గజాననుడు కూడా శివుడిని విడిచిపెట్టాడు ఒప్పుకుంటాడు. ఐతే.. ఈ విషయం తెలిసిన పార్వతి చాలా సంతోషిస్తుంది. భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

స్నానానికి వెళ్ళబోతూ.. పసుపు ముద్దతో వినాయకుడిని చేసి ఒక చోట ఉంచుతుంది. తాను వచ్చే వరకు కాపలా గా ఉండమని చెబుతుంది. ఆ సమయం లోనే శివుడు ఇంటికి వస్తాడు. ఐతే ఆ బాలుడు శివుడిని అడ్డగిస్తాడు. దీనితో శివుడు కోపగించి వినాయకుని శిరస్సుని ఖండిస్తాడు. ఆ తరువాత పార్వతి దేవి వచ్చి జరిగినది తెలుసుకుని దుఃఖిస్తుంది. తన బాలుడిని తెచ్చి ఇవ్వాలని కోరుతుంది. దీనితో.. పరమేశ్వరుడు బాధపడి.. తాను బయటకు రావడం వలన చనిపోయిన గజాసురుని తలని తీసుకొచ్చి వినాయకుడికి అమర్చి తిరిగి ప్రాణం పోస్తాడు. అందుకే వినాయకుడిని గజాననుడు అని కూడా పిలుస్తారు.

ఆ తరువాత కుమారస్వామి కూడా జన్మిస్తారు. వీరిద్దరూ చక్కగా ఉండేవారు. ఐతే.. సైన్యాధిపతి గా ఎవరిని నియమించాలి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనితో శివుడు ఆ కుమారులిద్దరికి ఓ పరీక్ష పెడతాడు. ఎవరైతే.. భూలోకం లో అన్ని పుణ్య నదులలో స్నానం చేసి వస్తారో.. వారే సైన్యాధ్యక్ష పదవి కి అర్హులని శివుడు చెబుతాడు. శివుడు చెప్పగానే.. కుమారస్వామి తన నెమలి వాహనం పై వెళ్ళిపోతాడు. ఐతే.. వినాయకుడు దుఃఖించి స్వామీ.. నా పరిస్థితి తెలిసినా ఇట్లు ఆనతి ఇవ్వడం తగునా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శివుడు తరుణోపాయం చెబుతాడు. తనను ధ్యానిస్తూ.. తల్లి తండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయమని చెబుతాడు. గణపతి అలానే తల్లితండ్రులను ధ్యానిస్తూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు.

అక్కడ కుమారస్వామి గంగ, యమునా, నర్మదా వంటి నదులలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు.. అప్పటికే వినాయకుడు స్నానం చేసి ఎదురు వస్తున్నట్లు కనిపించేది. అన్నీ నదులలోను స్నానం పూర్తి చేసుకున్న కుమారస్వామి తిరిగి కైలాసం చేరేసరికి గణపతి అప్పటికే అక్కడికి వచ్చేసినట్లు కనిపిస్తాడు. దీనితో అన్నగారి వద్దకు వచ్చి.. అన్నయ్యా.. మీ శక్తిని తక్కువ గా అంచనా వేసాను.. ఈ పదవి కి మీరే అర్హులని సెలవిస్తాడు. ఇక పరమేశ్వరుడు వినాయకుడిని విఘ్నాధిపతి గా నియమిస్తాడు.

Happy Vinayaka Chavithi Telugu Wishes Quotes

ఆ తరువాత దీనిని వేడుక గా జరుపుకుంటారు. అద్భుతంగా నిర్వహించిన వేడుకలో, వినాయకుడిని శివుని సైన్యానికి సారథిగా నియమించారు. కార్యక్రమం తర్వాత, గణేష్ తన తండ్రి మరియు తల్లి ముందు సాష్టాంగపడ్డాడు. అతనికి పెద్ద బొడ్డు ఉన్నందున, అతను వందనం చేయలేకపోతాడు. దీనితో అక్కడకు వచ్చిన దేవతలందరు తమ నవ్వును అదుపు చేసుకున్నారు. కానీ, శివుడు ధరించిన చంద్రుడు అతన్ని చూసి నవ్వాడు. దీనితో పార్వతి కి కోపం వచ్చి.. ఎవరైతే నిన్ను చూస్తారో వారు నీలాపనిందలు పాలు అవుతారని శపిస్తుంది.

ఈ శాపం సంగతి తెలియక ఋషిపత్నులు ఒకసారి చంద్రుని చూడడం వలన వారి భర్తలతో అపనిందలు పడతారు. వారి భర్తలు వారిని వదిలేసి దూరం గా ఉంటారు. ఆ తరువాత జరిగినది తెలుసుకుని పశ్చాత్తాప పడి తిరిగి భార్యలను కలుసుకుంటారు. ఈ సంఘటన తరువాత దేవతలంతా పార్వతీదేవిని శాపం ఉపసంహరించుకోవాలని కోరతారు. అప్పుడు పార్వతి దేవి శాంతించి.. వినాయక చతుర్థి రోజు మాత్రం ఎవరైనా చూస్తే నీలాపనిందలు పొందుతారని చెప్పింది. అప్పటినుంచి వినాయక చవితి రోజు ఒక్కరోజు చంద్రుడిని చూడకుండా జాగ్రత్త గా ఉండేవారు.

ద్వాపర యుగం లో.. ద్వారకలో శ్రీ కృష్ణుడు వినాయక చవితి రోజున అందరికి చాటింపు వేయించాడు. ఈరోజు గణేష్ చతుర్థి కావున ఎవరు చంద్రుని చూడవద్దని చెప్పాడు. ఆరోజు సాయం కాలానికి ఆవునుంచి పాలు పితుకుతు.. పాలల్లో చంద్రుని చూస్తాడు. అయ్యో అందరికి చెప్పి.. నేనే చూసానే.. ఇప్పుడు ఎలాంటి నిందలు వస్తాయో అని శ్రీ కృష్ణుడు అనుకుంటూ ఉంటాడు.

ఓ సారి సత్రాజిత్తు వద్ద ఉన్న శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు చూస్తాడు. అది బాగుందని.. తనకు ఇవ్వమని అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. దీనితో.. కృష్ణుడు దాని గురించి మరిచిపోతాడు. ఓ రోజు సత్రాజిత్తు కు తెలియకుండా.. అతని తమ్ముడు ఆ మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. కానీ తిరిగి రాలేకపోతాడు. ఈ క్రమం లో మణి కోసమే శ్రీ కృష్ణుడు తన తమ్ముడిని హత్య చేయించి ఉంటాడు అని సత్రాజిత్తు భావిస్తాడు. ఇది క్రమం గా ప్రచారం అయ్యి కృష్ణుడి చెవిన పడుతుంది. వినాయక చవితి రోజున చంద్రుని చూడడం వల్లనే తనపై ఇటువంటి నీలాపనింద వచ్చిందని కృష్ణుడు తలుస్తాడు.

వెంటనే సత్రాజిత్తు వద్దకు వెళ్లి.. శ్యమంతక మణి తన వద్ద లేదని.. అది ఏమైందో తెలుసుకుని.. ఆధారాలతో సహా చూపిస్తానని శపధం చేస్తాడు. కృష్ణుడు కూడా అడవికి వెళ్లి సత్రాజిత్తు తమ్ముడి కోసం వెతుకుతాడు. ఆ మార్గం మధ్యలో సత్రాజిత్తు కళేబరం, ఆ పక్కనే ఓ సింహం కళేబరం, కొద్దీ గా దూరం గా ఎలుగుబంటి అడుగు జాడలు కనిపిస్తాయి. మణి కోసమే సింహం దాడి చేసి ఉంటుందని.. ఆ సింహాన్ని, సత్రాజిత్తుని ఎలుగుబంటి చంపేసి మణిని తీసుకుని వెళ్ళుంటుందని కృష్ణుడు అర్ధం చేసుకుంటాడు. ఆ ఎలుగు బంటి అడుగులు పడిన వైపుగా వెళతాడు.

అక్కడ ఉయ్యాలకు ఈ మణి కట్టబడి ఉంటుంది. ఆ ఉయ్యాలలో ఓ పాపాయి ఉంటుంది. ఈ మణిని చూసి ఆడుకుంటూ ఉంటుంది. కృష్ణుడు అక్కడకు వెళ్లి మణిని తీసుకుంటాడు. దానితో ఆ పిల్ల ఏడవడం మొదలుపెడుతుంది. వెంటనే ఎలుగుబంటి రూపం లో ఉన్న జాంబవంతుడు అక్కడకు వచ్చి ఆ మణి కోసం కృష్ణుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం లో జాంబవంతుడు ఓడిపోతాడు. తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చి కృష్ణుడికి వివాహం చేసి.. ఆ మణిని కూడా కృష్ణుడికే ఇచ్చేస్తాడు.

ఆ తరువాత కృష్ణుడు ఆ మణిని తీసుకుని సత్రాజిత్తు వద్దకు వస్తాడు. జరిగినదంతా వివరిస్తాడు. కృష్ణుడిపై అట్టి నీలాపనిందను వేసినందుకు బాధపడి.. ఆ మణి నాకు వద్దు అంటూ కృష్ణుడిని ఉంచుకోమని ఇచ్చేస్తాడు. తన కుమార్తె ఐన సత్య భామ ను కూడా కృష్ణుడికే ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఆ తరువాత సాధుపుంగవులంతా.. కృష్ణుడి వద్దకు చేరి.. అయ్యా మీరు సమర్థులు కనుక మీ పై వచ్చిన నీలాపనిందను పోగొట్టుకున్నారు. మరి మాలాంటి సామాన్యులకు ఏదీ దారి అని అడుగుతారు. అప్పుడు శ్రీ కృష్ణుడు ఎవరైతే వినాయక చతుర్థి రోజు వినాయకుడిని పూజించి.. ఈ కథను చదువుకుంటారో.. వారికి ఎటువంటి నీలాపనిందలు ఉండవు అని కృష్ణుడు సెలవిస్తాడు. అప్పటి నుంచి వినాయక చతుర్థి రోజు పూజ చేసుకుని కథ చదువుకోవడం ఆనవాయితీ గా వస్తోంది.

నిజంగా ఈ కథను గనక హైపర్ ఆది గారు చదివి ఉంటె…అలా బాడీ షేమింగ్ చేస్తూ పంచ్ లు వేయరు అనుకుంట. మనం కథనుండి నేర్చుకోవాల్సింది చంద్రుడ్ని చూడొద్దు, చూస్తే ఏదో నిందలు మోయాల్సి వస్తుంది అని కాదు. ఇతరులను బాడీ షేమింగ్ చేయద్దు అని నేర్చుకోవాలి.


End of Article

You may also like