సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. ముకుంద మూవీతో ఒక్కసారిగా యూత్ లో కూడా పూజ హెగ్డే కి మంచి క్రేజ్ వచ్చింది. దాదాపు సౌత్ స్టార్ హీరోలందరితో పూజ జత కట్టింది. వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది.
Video Advertisement
అయితే ఇటీవల ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాలు నిరాశ పరిచిన పూజ క్రేజ్ మాత్రం తగ్గలేదు. తెలుగు చిత్రాలతో పాటు హిందీలో కూడా రెండు సినిమాలు చేస్తుంది. మరోవైపు స్పెషల్ సాంగ్స్‌లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కభీ ఈథ్ కభీ దివాలీ, సర్కస్ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల పూజా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది.
ఈ సందర్భంగా తన కెరీర్‌లో సక్సెస్, ఫెల్యూయిర్స్‌పై స్పందించింది. ‘తెలుగులో నేను నటించిన ఆరు సినిమాలు వరుసగా హిట్ అవ్వడం నా కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్. ఇక లోయేస్ట్ పాయింట్ వచ్చేసి నా డెబ్యూ (మొహంజోదారో) చిత్రమే. ఇది బాక్సాఫీసు వద్ద పరాజయం పొందడంతో నా కెరీర్‌లో అది ఒక చెత్త సినిమాగా నిలిచింది. ఆ సినిమా వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు అని పూజ తెలిపింది. ఈ క్రమంలో ‘అలా వైకుంఠపురంలో’ నాకు బ్రేక్ ఇచ్చింది.
పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ మొహంజోదారోతో బాలీవుడ్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్‌తో పూజా జతకట్టింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పూజ హెగ్డే తెలుగులో త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబుతో కూడా మరో మూవీ చేయనుంది.