“అమ్మ వారి కృప వల్లే నేను ఎదిగాను..” అంటూ బోనం పాట వివాదం పై క్లారిటీ ఇచ్చిన మంగ్లీ.. అసలు ఆ విషయం తెలుసుకోకుండా…?

“అమ్మ వారి కృప వల్లే నేను ఎదిగాను..” అంటూ బోనం పాట వివాదం పై క్లారిటీ ఇచ్చిన మంగ్లీ.. అసలు ఆ విషయం తెలుసుకోకుండా…?

by Anudeep

Ads

ఇటీవల బోనాల సందర్భం గా మంగ్లీ “చెట్టు కింద కూసున్నవమ్మ” పాట ను ఆలపించిన సంగతి తెలిసిందే. ఈ పాట ఎంత వైరల్ అయిందో.. అంతకంటే ఎక్కువే విమర్శలు వచ్చాయి. అమ్మవారిని తిడుతూ పాడావంటూ చాలా మంది విమర్శించారు. భగవంతుని ప్రార్థనల్లో నిందాస్తుతి ఎప్పటినుంచో ఉన్నదే. ఈ పాట కూడా అదే ధోరణి లో సాగుతుంది. ఐతే.. ఈ పాట విషయమై చాలా విమర్శలు రావడం తో మంగ్లీ చాలా ఎమోషనల్ అయ్యారు.

Video Advertisement

singe rmangli 2

తాజాగా.. ఈ విమర్శల విషయమై మంగ్లీ స్పందించారు. ఇందుకు సంబంధించి వివరణ ఇస్తూ సోషల్ మీడియా లో పెద్ద పోస్ట్ నే పెట్టింది. విమర్శించే వారు ముందు గ్రామ దేవతలను ఎలా పూజిస్తారో తెలుసుకోవాలని కోరింది. ఈ పాటను జానపద గేయాల రచయితా పాలమూరి రామస్వామిగారు పాతికేళ్ల క్రితమే రాసారని స్పష్టం చేసారు. ఆయన ఆలోచన ప్రకారం.. ఈ పాటలో వచ్చే మోతెవరి అని పదానికి “గ్రామ పెద్ద” అనే అర్ధం వస్తుందని వివరించారు. కానీ.. వాడుక భాషలో ఈ పదం వ్యతిరేక పదం గా వచ్చిందన్నారు. ఈ పాట కోలాట రూపం లో నిందాస్తుతి లో కొనసాగుతుందని.. మాకు తెలిసిన కళాకారులు, పెద్దల సలహాలు తీసుకునే ఈ పాటను చిత్రీకరించామన్నారు.

singer mangli 4

భక్తి లో వైరి భక్తి, మూఢ భక్తి అంటూ రకరకాలు ఉంటాయి అని… ఈ పాటని కూడా భక్తి భావం లోనే రూపొందించామన్నారు. గ్రామదేవతల ఒగ్గు కధలు, బైండ్లోల్ల ఆచారాల్లో కూడా రకరకాలు ఉన్నాయని వివరించారు. తానేమి పండితుల కుటుంబం నుంచి రాలేదనీ.. తానూ కూడా గిరిజన తండా నుంచి వచ్చిన వ్యక్తిగానే చెప్పుకున్నారు. బోనాలు, బతుకమ్మ పండగల లాగా వారి బంజారా లో సాతి భవాని, తీజ్ పండుగలలో ప్రకృతినే పూజిస్తామని చెప్పుకున్నారు.

singer mangli 5

మేము గ్రామదేవతలు పూజిస్తాము. కష్టం వచ్చినా.. దుఃఖం వచ్చినా వారినే నమ్ముకుని పూజలు చేస్తాము. గ్రామ దేవతలను మా ఇంట్లోని వ్యక్తులగానే భావిస్తాము. మేము తీసుకునే ఆహారాన్నే గ్రామ దేవతలకు కూడా సమర్పిస్తామని చెప్పుకొచ్చారు. ఆ అమ్మవారి కృప, ఆంజనేయ స్వామి ఆశీస్సులు, మీ అందరి ఆదరాభిమానాలు వలెనే నేను సింగర్ ని అయ్యాను అని భావిస్తాను. అందుకే ఇప్పటికీ నేను పుట్టిన తండాలో ఉన్న మా తాతలకాలం నాటి హనుమంతుని విగ్రహానికి గుడి కట్టించి పూజలు చేస్తున్నామని తెలిపారు. కనీసం ఒక్కరోజు కూడా గుడికి వెళ్లనివారు, బోనాన్ని జరుపుకోని వారు కూడా నా జాతి, నా కులం అంటూ ఈ పాట పై విమర్శలు చేసారని బాధపడ్డారు.

singer mangli

బతుకమ్మ, సమ్మక్క సారక్క, శివరాత్రి, బోనాలు.. ఇలా ఏ పండగ వచ్చినా నేను పాటలు పాడుతున్నానని.. నన్ను మీరు ఆదరిస్తున్నారని గుర్తు చేసుకున్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా నాకు మీరు చూపించిన అభిమానానికి ఎప్పటికి రుణపడి ఉంటానన్నారు. ఒక్క రోజులో నేను ఏమి ఫేమస్ అవ్వలేదని.. నా వెనుక నా పదేళ్ల కష్టం ఉందని ఆమె గుర్తు చేసుకున్నారు. కొందరు వారి ఇళ్ళల్లో కూడా తల్లి, చెల్లి ఉందన్న విషయాన్నీ మరిచిపోయి కామెంట్ లు చేసారని బాధపడ్డారు. పాట నేపధ్యం కూడా తెలుసుకోకుండా నిందిస్తున్నారన్నారు. నిందాస్తుతి సాహిత్యాన్ని తెలుసుకుని నిందలు చేస్తే బాగుండేదని అన్నారు.

singer mangli 3

ఈ వివరణ కూడా నన్ను అభిమానించే వారి మనసుకి కష్టం కల్గించిన వారికోసం, నా మనసుని బాధపెట్టిన వారికోసం పెడుతున్నామన్నారు. ఈ పాట పై విమర్శలు వచ్చిన రోజే మార్చవచ్చని.. కానీ.. ఈ పాట ను రాసిన వృద్ధ రచయితను తక్కువ చేయడం ఇష్టం లేక చేయలేదన్నారు. ఆ పెద్దాయన అనుమతితోనే లిరిక్స్ లో కొన్ని మార్పులు చేశామన్నారు. నన్ను వ్యతిరేకించిన వారిని కూడా నా వారి గా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని మంగ్లీ తన పోస్ట్ లో తెలిపారు.


End of Article

You may also like