ఆ ఐఏఎస్ అధికారిణి కోసం అక్కడి ప్రజలు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు..! ఆమె ఎవరంటే..?

ఆ ఐఏఎస్ అధికారిణి కోసం అక్కడి ప్రజలు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు..! ఆమె ఎవరంటే..?

by kavitha

Ads

ప్రజలు తమకు మంచి చేసిన వారు ఎవరైనా బాగా గుర్తుపెట్టుకుంటారు. తమ కోసం మంచి పనులు చేస్తున్నవారికి అండగా నిలబడతారు, వారికోసం ఎవరితో అయినా పోరాడడానికి కూడా వెనుకాడరు. అది పొలిటికల్ లీడర్లు లేదా అధికారులు కూడా కావచ్చు.

Video Advertisement

సాధారణంగా రాజకీయ నాయకుల కోసం ప్రజలు రోడ్ల పైకి రావడం అనేది చూస్తుంటాము. కానీ ఆఫీసర్ల కోసం చాలా అరదుగా ప్రజలు రోడ్ల పైకి వస్తుంటారు. అలాంటి వారిలో ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి ఒకరు. ఆమె కోసం ప్రజలు రోడ్లపై ధర్నాలు చేశారు.  ఆమె ఐఏఎస్ ప్రయాణం గురించి ఇప్పుడు చూద్దాం..

రోహిణీ సింధూరి 1984 లో హైదరాబాద్ లో మే 30న శ్రీలక్ష్మీరెడ్డి, దాసరి జయపాల్‌రెడ్డి దంపతులకు జన్మించింది. ఆమె సొంతూరు ఖమ్మం జిల్లాలోని రుద్రాక్షపల్లి గ్రామం. రోహిణి ఇంజనీరింగ్‌ దాకా హైదరాబాద్ లో చదువుకుంది.  అందరి తల్లితండ్రుల వలె ఆమె తల్లితండ్రుల కూడా కుమార్తెను మంచి స్థితిలో చూడాలని, ఇంజనీరింగ్ తరువాత రోహిణిని పై చదువుల గురించి ఫారెన్ పంపించాలని భావించారు.  కానీ రోహిణి చిన్నతనం నుంచి తల్లి చేసే సేవా కార్యక్రమాలు చస్తూ పెరిగిన ఆమె, తల్లి లాగే తాను జనాలకు సేవ చేయాలనుకున్నారు.

విదేశాలకు వెళ్లమంటే వద్దని, కలెక్టర్‌ అవుతానని పట్టుబట్టి రోహిణి తన కలను నెరవేర్చుకుంది. లక్ష్య సాధనలో శ్రీలక్ష్మి తన కుమార్తెకు అండగా నిలబడింది.  ఐఏఎస్ కావడానికి చాలా కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నారు.  హిమాయత్‌నగర్‌లో ఉన్న  ఆర్‌.సి.రెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్ తీసుకుంది.  ఆ తరువాత మెయిన్స్ కోసం ఢిల్లీ వెళ్లి,  2009లో యూపీఎస్సీపరీక్షల్లో 43వ ర్యాంకు సాధించింది. ఆమెకు కర్ణాటక కేడ‌ర్‌లో జాయిన్ అయ్యింది. అక్కడి ప్రజలని కలుస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ, సాగుతోంది. ఈ క్రమంలో అక్కడి ప్రజలలో ఆమెకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఈ మధ్యకాలంలో  ఏర్పడిన రెండు, మూడు సమస్యలలో కర్ణాటక మంత్రులు రోహిణితో విభేదించి, ట్రాన్స్ఫర్ చేయాలని చూశారు. ఆమెకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్‌ సైతం వచ్చాయి. కానీ ఈ విషయం తెలిసిన అక్కడి ప్రజలు రోహిణి బదిలీ చేయకూడదంటూ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ప్రజలు ఉద్యమాలు, చేయడంతో 3 సార్లు ఆమె బదిలీని ప్రభుత్వం  నిలిపివేసింది. నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ ని ఇబ్బందిపెడితే, ప్రజల ఎలా స్పందిస్తారో రోహిణి విషయంలో కర్నాటక గవర్నమెంట్ కూడా చూసింది.

Also Read: గొప్ప మనసున్న నటుడు నందు.. ఏకంగా 800 మందికి వండి వడ్డించిన ఘనుడు!

 

 


End of Article

You may also like