Ads
ఏ మనిషికైనా ఏదైనా పని మళ్ళీ మళ్ళీ చేస్తే బోర్ కొట్టేస్తుంది. అలాగే రోజు ఒకటే రకం ఫుడ్ తింటుంటే కూడా తినబుద్ధి కాదు. అందుకే అప్పుడప్పుడు హోటల్స్ ని ఆశ్రయిస్తాం. హోటల్స్ కూడా ప్రజలను ఆకర్షించడానికి విభిన్నమైన వంటకాలతో మెనూ తయారుచేస్తారు.
Video Advertisement
కానీ ఒక హోటల్ మాత్రం ఎన్నో సంవత్సరాల నుండి ఒకే వంటకాన్ని చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే జనాలు కూడా ఆ ఒక్క వంటకం తినడం కోసం హోటల్ కి వెళ్తున్నారు. అసలు విషయానికి వస్తే.
విజయవాడలో ఎస్ ఎస్ ఎస్ అనే హోటల్ ఉంది. ఈ హోటల్ ని ఎస్ ఎస్ ఎస్ ఇడ్లీ హోటల్ అని కూడా అంటారు. దాదాపు 40 సంవత్సరాల నుండి ఈ హోటల్ లో ఒకటే వంటకం తయారవుతోందట.
ఆ వంటకం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. హోటల్ పేరు చూస్తే ఈ పాటికి మీకే అర్థం అయిపోయి ఉంటుంది. అవును. 40 సంవత్సరాల నుండి ఈ హోటల్ లో ఇడ్లీ తప్ప వేరే ఏ వంటకాన్ని తయారు చేయట్లేదు.
విజయవాడ లో ఈ హోటల్, ఇంక ఈ హోటల్ లో తయారు చేసిన ఇడ్లీ చాలా ఫేమస్ అట. విజయవాడ లో నివసించే వారే కాకుండా వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా ఈ హోటల్ లో ఇడ్లీ ఖచ్చితంగా రుచి చూస్తారట. ఒక ఇడ్లీ 15 రూపాయలు ఉంటుందట.
ఇడ్లీ తో పాటు నెయ్యి, అల్లం చట్నీ, పల్లి చట్నీ ఇస్తారట. ఈ హోటల్ సోమవారం నుండి శనివారం వరకు పొద్దున 6:00 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 9:30 వరకు ఉంటుంది. ఆదివారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు సాయంత్రం 4:30 నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
విజయవాడ లో నివసించే వాళ్ళు కచ్చితంగా ఈ హోటల్ కి ఒక్కసారైనా వెళ్లి ఉంటారు. ఒకవేళ వెళ్లకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళండి. మీరు ఒకవేళ వేరే ప్రాంతం వాళ్ళు అయితే ఎప్పుడైనా విజయవాడ వెళ్తే ఈ హోటల్ ఇడ్లీ తప్పకుండా రుచి చూడండి.
watch video:
End of Article