ఆర్థిక సమస్యలు తొలిగిపోవాలంటే ఇంట్లో ఈ పూల మొక్కను పెంచుకోవాలి..

ఆర్థిక సమస్యలు తొలిగిపోవాలంటే ఇంట్లో ఈ పూల మొక్కను పెంచుకోవాలి..

by kavitha

Ads

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మందార మొక్కను నాటడం వల్ల, వారి జాతకంలోని సూర్య స్థానం బలపడుతుందని. ఆ వ్యక్తి అదృష్టం కూడా మారుతుందని విశ్వసిస్తారు. ఇంట్లో ఈ మొక్కను సరైన దిశలో పెట్టినట్లయితే, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

Video Advertisement

అంతే కాకుండా  ఇంట్లో సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. దీని వల్ల ఆ వ్యక్తి  జీవితంలో ఆర్థిక సమస్యలు ఏర్పడవని చెప్తున్నారు. ఎరుపు మరియు గులాబీ వర్ణంలో ఉండే ఈ పుష్పం చాలా ప్రత్యేకమైనది. మందార మొక్కను ఇంట్లో పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి  జ్యోతిష్కుడు అలోక్ పాండ్యా ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
1. ఎవరి జాతకంలో అయినా సూర్యుని యొక్క స్థానం బలహీనంగా ఉన్నట్లయితే వారి ఇంట్లో మందార మొక్కను తప్పనిసరిగా నాటాలి. అయితే మందార మొక్కను పెట్టేటప్పుడు దిశను చూసుకోవడం అనేది ముఖ్యం. తూర్పు దిశలో పెట్టడం వల్ల సూర్య స్థానం బలపడుతుంది.

2. మందార మొక్కను ఇంట్లో నాటడం వల్ల మంగళ దోషం పోతుంది. వ్యక్తి జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నా,  పెళ్లి జరగడంలో జాప్యం వస్తున్నా ఆ ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల మంచి జరుగుతుందని చెప్తున్నారు.

3. మందార మొక్కను పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఏర్పడవు. ఈ మొక్క నాటడం వల్ల తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధం మరియు గౌరవం పెరుగుతుంది.

4. వాస్తు శాస్త్రం ప్రకారం మందార మొక్క ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తి ఎప్పుడూ ఉండదు. సానుకూల శక్తి ఎల్లప్పుడూ ఆ ఇంట్లో ఉంటుంది.

5. వాస్తు శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా మందార మొక్క, మందార పువ్వు లక్ష్మిదేవికి ప్రీతికరమైనవి. మందార పుష్పాన్ని లక్ష్మి దేవికి సమర్పించినట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి.

6. వ్యాపారంలో ఏదైనా సమస్యను వచ్చినపుడు లేదా సడెన్ గా పని చెడిపోయినపుడు సూర్యుడికి సమర్పించే నీటిలో మందార పువ్వును వేసి సూర్యునికి సమర్పించాలి. ఇలా చేయడంతో  బిజినెస్ లో వచ్చే సమస్యలు తవాగిపోతాయి.

Also Read: 100 సంవత్సరాల క్రితం నాటి “ట్రైన్ టికెట్” చూశారా..? అప్పట్లో టికెట్ ధర ఎంత అంటే..?


End of Article

You may also like