Ads
మనకు తెలియని చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి. అయితే ఈ అనారోగ్య సమస్య కనుక మీకు ఉందంటే కచ్చితంగా ఇబ్బంది పడాల్సిందే. ఈ జబ్బు ఉన్న వాళ్ళు పొరపాటున వాళ్ల వాహనాన్ని నడిపేటప్పుడు పోలీస్ చెకింగ్ జరిగిందంటే అది నిజంగా వాళ్లకి తలనొప్పే. ఎందుకంటే బ్రెత్ ఎనలైజర్ టెస్ట్ చేశారంటే మద్యం తాగితే ఎలాంటి ఫలితం వస్తుందో అదే ఫలితం డ్రంకెన్ నెస్ డిసీజ్ ఉంటే వస్తుంది.
Video Advertisement
అయితే ఈ జబ్బు ఏంటి..? ఈ జబ్బు వల్ల ఏమౌతుంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ జబ్బు ఉన్న వాళ్ళలో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అది ఆల్కహాల్ గా మారిపోతుంది. ఈ సమస్యనే బీర్ గట్ లేదా గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ లేదా ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అని అంటారు.
ఈ సమస్య ఉంటే తాగకపోయినా సరే మత్తు వచ్చేస్తుంది. అలా వచ్చే మత్తు వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మద్యం తాగినప్పుడు సాధారణంగా కలిగే లక్షణాలైన నోరు ఎండిపోవడం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఇలాంటివి ఈ వ్యాధి ఉన్న వాళ్ళల్లో వస్తాయి.
డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ జబ్బు రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే..? జీర్ణకోశంలో ఉండే శాకారోమైసిస్ సెరివిసీ అనే ఒక రకమైన సూక్ష్మజీవి. ఎలా తగ్గించాచ్చంటే.. పిండి పదార్థాలకు దూరంగా ఉంచడం. అలానే డైట్ థెరపీ వంటి వాటి ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ వలన కూడా బయట పడటం అవుతుంది అని వైద్యులు అంటున్నారు.
End of Article