Ads
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన దేవదాసు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఇలియానా. ఆ తర్వాత వరుస ఆఫర్లతో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయి స్టార్ హీరోయిన్ హోదా అందుకుంది. 2006లో ఆమె కెరీర్ మొదలుపెట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు ఇలియానా హవా కొనసాగించింది.
Video Advertisement
2012లో హిందీ భాషలో బర్ఫీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. అక్కడి నుంచి ఇలియానా హవా టాలీవుడ్ లో తగ్గడం మొదలైంది. వరస బాలీవుడ్ ఆఫర్లను చేజిక్కించుకుంటు కొంచెం కొంచెం గా టాలీవుడ్ దూరమైపోయింది. మరలా 2018 లో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా తయారయింది ఇలియానా. ఏంటి ఇలియానా ఇలా లావైపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా చక్కర్లుకొట్టాయి. ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు ఇలియానా.
కానీ ఎక్కడో ఒకచోట సోషల్ మీడియాలో ఇలియానాపై వార్తలు వస్తూనేఉన్నాయి. అంతే కాకుండా ఇలియానా లైఫ్లో ప్రేమకథలు లిస్ట్ కూడా బాగానే ఉంది. విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఎక్కడ చూసినా ఆండ్రూ, ఇలియానా జంట కనిపిస్తుండేది. బీచ్ లో బికినీ తో ఇలియానా చేసే ఫోజులు ఫోటోలు తీస్తూ రచ్చ రచ్చ చేసేవారు. తర్వాత కాలంలో ఏమయిందో తెలియదు కానీ వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ బంధానికి తెరపడింది. దీనితో ఇలియానా డిప్రెషన్లోకి వెళ్లి పోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా హల్ చల్ చేశాయి.
ఇప్పుడు ఇలియానా మరోసారి ఆ స్టార్ హీరోయిన్ సోదరుడితో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మల్లీశ్వరి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కత్రినాకైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతుందట ఇలియానా. అంతేకాకుండా అతనితో సహజీవనం కూడా సిద్ధమైపోయిందంట. త్వరలోనే కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో పెళ్లికి సిద్ధమైనట్లు బాలీవుడ్ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి అయిన ఇలియానా ప్రేమ ఫలిస్తుందో.. లేదో.. వేచిచూడాలి.
End of Article