బుల్లితెర హీరో గా పేరు తెచ్చుకున్న సుధీర్ కు అభిమానుల కొదవేమి లేదు. కేవలం సుధీర్ పై పడే పంచ్ లు.. సుధీర్ వేసే పంచ్ లు చూడడం కోసమే బుల్లితెర పై వచ్చే కామెడీ షో లను ప్రేక్షకులు చూస్తూ ఉంటారనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఎంట్రీ ఇచ్చే టైం లో సుధీర్ స్టైల్ కి, డాన్స్ కి కూడా చాలానే ఫాలోయింగ్ ఉంది.

ssr

జబర్దస్త్ షో తో సుధీర్ కి పాపులారిటీ వచ్చినా.. ఆ తరువాత ఢీ, శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి షో లలో కూడా నవ్వుల పువ్వులు పోయిస్తున్నాడు. తనపైన ఎన్ని పంచ్ లు వేసినా.. అమాయకం గా సుధీర్ పెట్టె ఎక్స్ప్రెషన్స్ కి ఎంతమంది ఫాన్స్ ఉన్నారో లెక్కలేదు. తన అభిమానులను నవ్వించడానికి ఎన్ని పంచ్ లు వేసినా పట్టించుకోనని.. వాళ్ళని నవ్వించడం కోసం ఏమైనా చేస్తానని సుధీర్ ఇప్పటికే పలు సార్లు స్పష్టం చేసాడు.

తాజాగా విడుదల అయినా ప్రోమో లో సుధీర్ పై మరోసారి పంచ్ ల వర్షం కురిసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇవ్వగానే సుధీర్ పై ఇమ్మాన్యుయేల్ పంచ్ ల వర్షం కురిపించాడు. స్టేజి పై ఉన్న లేడీ కంటెస్టెంట్ లను చూపిస్తూ ఎవరు వీళ్ళు అడిగితె.. సుధీర్ దారిలో కనిపిస్తే తీసుకువచ్చాను అని చెప్తాడు. వెంటనే ఇమ్మానుయేల్ అందుకుని.. “దారిలో కనిపించారా..? నీ దారిలోకి వచ్చారా..? అంటూ పంచ్ వేస్తాడు.

Watch Video: