భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లైన ఆడవాళ్ళు కచ్చితంగా తాళి ధరిస్తారు. ఒక్కొక్క ప్రదేశంలో తాళిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. తాళి ధరించడానికి వెనుక ఉన్న కారణం చాలా మందికి తెలియక పోవచ్చు. కొంతమంది నలుపు ఇంకా బంగారం రంగు లో ఉన్న మంగళ సూత్రాన్ని ధరిస్తారు. అలా నలుపు ఇంకా బంగారం రంగు లో ఉన్న మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారట.

నలుపురంగులో శివుడు, బంగారు రంగులో పార్వతీ దేవి కొలువై ఉంటారట. పెళ్లి కూతురు సుమంగళిగా ఉండాలని ఎటువంటి చెడు జరగకూడదు అని ఆ పార్వతీ పరమేశ్వరులు హృదయానికి దగ్గరగా ఉంటారట. మంగళసూత్రంలో పసుపు తాడు వాడతారు. మూడు ముళ్ళు వేసిన తర్వాత ప్రతి ముడికి కుంకుమను అద్దుతారు. తర్వాత మంగళ సూత్రం బంగారం వి చేయించుకుంటారు. మంగళసూత్రం బంగారం ది చేయించుకున్నా కూడా మధ్యలో తాడు మాత్రం పసుపుతాడు వాడాలట. పసుపు కుంకుమలలో సర్వమంగళ దేవి కొలువై ఉంటారట.

కొంతమంది తమకిష్టమైన దేవుళ్ళని మంగళసూత్రం పై తయారు చేయించి వేసుకుంటారు. కానీ అలా వేసుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీ దేవి ప్రతిమ ఉన్న మంగళ సూత్రం అసలు ధరించకూడదట. ఒకవేళ అలా జరిగితే సిరి సంపదలు పోతాయట. కష్టాలు రావడం మొదలవుతాయట. అందుకే మంగళసూత్రం మామూలుగా వేసుకోవడం మంచిదట.

శుక్రవారం ఇంకా మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆ పసుపు ని మంగళసూత్రానికి పూజ సమయంలో పెట్టుకోవాలట. అలా చేస్తే ఐదో తనాన్ని ఇచ్చే పార్వతీ దేవి కటాక్షిస్తారట. అలాగే మంగళసూత్రానికి సేఫ్టీ పిన్, లేదా ఇనుము తో తయారు చేసిన వస్తువులు పెట్టకూడదట. మంగళసూత్రానికి ఎరుపు (పగడం) ఇంకా నల్లపూసలు ఉండాలట.