Ads
ముక్కు పుడక కేవలం అందం పెంచడం మాత్రమే కాదు.. స్త్రీల ఆరోగ్యం విషయం లో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతే కాదు.. ఆడవారికి ముక్కుపుడుకను బహుమానం ఇచ్చేవారు అయితే మేనమామ గాని లేక కాబోయే భర్త కానీ అయి ఉండాలంటారు. భర్త బహుమానం గా ఇచ్చే ముక్కుపుడక ఎంతో అపురూపమైనది. ఆడవారు పెళ్లి సమయం లో ధరించిన ముక్కు పుడకను అందుకే తీయరు. మంగళసూత్రాలలాగానే దానిని కూడా జాగ్రత్త గా కాపాడుకుంటూ ఉంటారు.
Video Advertisement
రాజుల కాలం నుంచి ముక్కుపుడక ఆభరణం గా వెలుగొందుతోంది. ఆడపిల్లలకు ఏడేళ్ల వయసు లో ముక్కు కుట్టించి బంగారు తీగతో చుట్టిస్తారు. ఆ తరువాత రంధ్రము ఏర్పడ్డాక రకరకాల రాళ్లు పొదిగిన ముక్కుపుడక ను ధరింప చేసేవారు. ముక్కుపుడక గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుని సతి సత్యభామ తన చెలికత్తెని రాయబారం పంపడానికి ఆమె ముక్కుపుడకనే లంచం గా ఇవ్వాల్సి వచ్చింది.
అలానే.. అంతటి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా కృష్ణానది కొండపై ఉన్న దుర్గమ్మ ముక్కెర ను తాకితే యుగాంతం తప్పదని సెలవిచ్చారు. ముక్కు పుడకకు అంతటి ప్రాముఖ్యత ఉంది మరి. అయితే.. ముక్కెర ధరించడం వలన శాస్త్రీయం గా ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం..
- మనం వాసనను ముక్కుతోనే చూస్తాం.. ఈ వాసన పీల్చే శక్తి లో పంచభూత తత్వాలు కలిసి ఉంటాయి. అందుకే చెడ్డ శక్తి ప్రవేశించకుండా ముక్కెర ధరిస్తారు.
- బంగారు ముక్కుపుడకలు ధరించడమే ఉత్తమం. ఎందుకంటే బంగారం శుద్ధమైనది. ఆడవారు వంట చేసే సమయం లో వారి ఉచ్వాస, నిశ్వాసాల నుంచి వచ్చే గాలి శుద్ధపడి ఆహరం పరిశుద్ధమవుతుంది.
- ముక్కుపుడక లేకుండా దైవ నివేదన వంట వండరాదని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే భారతీయ స్త్రీలు ముక్కుపుడక ధరించే ఉంటారు.
- ఇడ పింగళ నాడులు ప్రాణశక్తికి సంకేతం.. ఇవి కూడా ముక్కుపుడక ధరించడం వల్లనే ఆక్టివేట్ అవుతాయి.
- ఆడవారు ఎక్కువ శుభ్రపరిచే పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ సమయం లో సూక్ష్మక్రిములు కారణం గా వారి శరీరం లో చెడు గాలి చేరకుండా ఉండేందుకు వారికి ముక్కెర సాయపడుతుంది.
- మెదడు లోని నాడీ వ్యవస్థను కూడా ముక్కెర సరిచేయగలుగుతుంది.
- కంటికి కనపడని చెడు శక్తులను కూడా ముక్కెర అడ్డుకోగలదు.
End of Article