సహజంగా చిన్న కుటుంబంలో ఐదుగురికి వంట చేయడమే పెద్ద పనిగా భావిస్తాము. అయితే కురుక్షేత్ర యుద్ధంలో 50 లక్షలకు పైగా పాల్గొన్నారు.

Video Advertisement

ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కర్ణుడు ఇలా ఎందరో యోధులు మరియు సైనికులు పాల్గొన్నారు. మరి ఇన్ని లక్షల మంది పాల్గొన్నప్పుడు వారికి ఆహారాన్ని ఎలా అందించగలిగారు..? దాని గురించి మరి ఇప్పుడే తెలుసుకోండి.

ఈ కురుక్షేత్ర యుద్ధంలో 50లక్షలకు పైగా పాల్గొనడం వల్ల వారికి ఆహారాన్ని అందించడం చాలా కష్టమైన పని. రోజుకు వేలాది మంది చనిపోయేవారు, మిగిలిన వారికి ఆహారాన్ని అందించేవారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు మరియు కౌరవులు రెండు పక్షాలుగా ఏర్పడి వారికి ఇరువురి సైన్యాలలో మద్దతు తెలిపే యోధులు కూడా పాల్గొన్నారు.

మహాభారత యుద్ధం చాలా పెద్దది అయినా సరే ఈ యుద్ధంలో ఇద్దరు రాజులు మాత్రం పాల్గొనలేదు. వారు బలరాముడు మరియు రుగ్మి. వీరిద్దరితో పాటు ధృతరాష్ట్రుడికి తమ్ముడైన విదురుడు కూడా పాల్గొన లేదు. భారతదేశంలో ఎన్నో గొప్ప రాజ్యాలు ఈ యుద్ధంలో పాల్గొనగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఉడుపి రాజు నరేషుడు ఈ యుద్ధంలో పాల్గొనలేదు.

ఒకరోజు యుద్ధభూమి వద్దకు నరేషుడు వచ్చాడు, ఆ సమయంలో పాండవులు మరియు కౌరవులు వారి సైన్యంలో చేరమని కోరగా నరేషుడుకు ఏమి చేయాలో తోచక శ్రీకృష్ణుడి వద్దకు వెళ్తాడు. ఈ యుద్ధ సమయంలో ఎవరికి మద్దతు ఇవ్వాలి అని శ్రీకృష్ణుడిని అడగగా, శ్రీకృష్ణుడు నరేషుడు యొక్క ఉద్దేశం అడిగాడు.

ఎన్నో లక్షల మంది యుద్ధంలో పోటీ చేస్తున్నారు, వారికి ఆహారాన్ని అందించాలనే ఆలోచన ఉందని సమాధానమిచ్చాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు నీ ఆలోచన ఉత్తమమైనదని, ఇది నువ్వే చేయగలవని చెప్పాడు. యుద్ధం జరిగినన్ని రోజులు నరేషుడు మరియు వారి సైన్యం యుద్ధంలో పాల్గొన్న అందరికీ ఆహారాన్ని అందిచాడు. అయితే ఏ రోజు కూడా ఒక్క మెతుకు కూడా మిగలలేదు మరియు లోటు కూడా కాలేదు.

యుద్ధం ముగిసింది ధ్రువరాజుకి పట్టాభిషేకం కూడా జరిగింది. ధ్రువ రాజు నరేషుడుని ఇలా ప్రశ్నించాడు, ఓ రాజా మీరు లక్షలమందికి సరైన విధంగా ఆహారాన్ని ఎలా అందించగలిగారు? అయితే ధ్రువ మహారాజు మీ సైన్యంలో తక్కువ మంది ఉండగా మీరు ఎలా విజయం పొందారని ప్రశ్నించాడు.

దానంతటకి కారణం శ్రీకృష్ణుడే అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు నరేంద్రుడు ఈ ఆహారాన్ని అందించడానికి కూడా శ్రీకృష్ణుడే అని చెప్పాడు. ప్రతి రోజు నేను కొన్ని వేరుశెనగ కాయలను శ్రీకృష్ణుడికి ఇచ్చేవాడిని.. శ్రీకృష్ణుడు ఎన్ని వేరుశెనగ కాయలను తింటారో దానికి వెయ్యి రెట్లు మంది చనిపోయేవారు. ఈ విధంగా నేను ఆహారాన్ని తయారుచేయడం జరిగింది అని చెప్పాడు. అందుకే కృష్ణం వందే జగద్గురం అని అంటారు.