త్రినాథరావు దర్శకత్వం లో మాస్ మహారాజ రవి తేజ నటిస్తున్న సినిమా ధమాకా. ఎనెర్జిటిక్ మాస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రం డిసెంబర్ 23 న థియటర్లలో విడుదల కానుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న సినిమా ధమాకా. డబుల్ ఇంపాక్ట్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం లో రవి తేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఈ చిత్రం పై అంచనాలు పెంచేస్తున్నాయి.

Video Advertisement

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన దండకాడియాల్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాతో మాస్ రాజా సూపర్ హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సాంగ్ లో రవి తేజ, శ్రీలీల ఎనెర్జిటిక్ గా డాన్స్ చేసారు. అయితే ఈ పాటకి ముందు షూటింగ్ సమయం లో రవి తేజ కాలి లో ఒక ఇనప చువ్వ దిగి 12 కుట్లు కూడా పడ్డాయట. అయినా ఆ కాలి గాయం తోనే .. రవి తేజ ‘దండ కడియాల’ సాంగ్ లో డాన్స్ చేశారట. ఈ విషయాన్ని శ్రీ లీల తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించింది.

ravi teja leg injury during shooting..

సినిమా రిలీజ్ దగ్గర పడటం తో షూటింగ్ లేట్ అవ్వకూడదని రవి తేజ మొండిగా ఈ పాట లో డాన్స్ చేశారట. ఈ సాంగ్ ని చూస్తుంటే రవి తేజ అంత పెద్ద గాయం తో ఉన్నట్టు అనిపించదు. అంతే బాగా డాన్స్ చేసాడు మాస్ మహారాజ్. రవి తేజ గత రెండు చిత్రాలు ప్లాప్ కావడం తో ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ మూవీ రవి తేజ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి..