Ads
సాధారణంగా ప్రతి ఇంటిలోను ఫ్యాన్ ఉంటుంది. ఇక ఎండకాలంలో కూలర్, ఏసీ లాంటివి కొనుగోలు చేయలేనివారు ఫ్యాన్‌తోనే సరిపెట్టుకుంటారు. ఆ క్రమంలో ఫ్యాన్ ఎక్కువ రోజులు ఆన్‌లో ఉండటంతో ఫ్యాన్ వేగం తగ్గడం జరుగుతుంది. ఇది కూడా సాధారణంగా ఎదురయ్యే సమస్యే. ఇక సమ్మర్ లో ఫ్యాన్ వేగంగా తిరగకపోతే అదొక పెద్ద సమస్య అని చెప్పవచ్చు.
Video Advertisement
ఫ్యాన్ స్పీడ్ ను 5 నంబర్ లో పెట్టినప్పటికి 1 నంబర్ లో ఉన్నట్లే తిరుగుతుంది. ఈ సమస్య వల్ల వేసవి కాలంలో సరిపడా గాలి రాదు. ఇలా కావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఫ్యాన్ బ్లేడ్‌లకు బాగా దుమ్ము పట్టి ఉండటం కూడా స్పీడ్ తగ్గడానికి కారణం కావచ్చు. దుమ్ము కూడా ఫ్యాన్ నుండి వచ్చే గాలి ప్రసరణను ప్రభావితం చేస్తుంది.
ఫ్యాన్ బ్లేడ్లను శుభ్రం చేసేముందు స్విచ్ ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్యాన్ ఆఫ్ అయిన తర్వాత, ముందుగా పొడి గుడ్డతో ఫ్యాన్ బ్లేడ్లను శుభ్రం చేసి, ఆ తరువాత తడి గుడ్డతో శుభ్రపరచాలి.
ఇలా చేసిన తరువాత పని చేయనట్లైతే, ఫ్యాన్ వేగాన్ని పెంచడం కోసం కెపాసిటర్‌ను మార్చవచ్చు. కెపాసిటర్ సాధారణంగా 70 నుండి 80 రూపాయల మధ్య ఉంటుంది. కెపాసిటర్ ను ఈ-కామర్స్ వెబ్ సైట్లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ షాప్ లో కూడా లభిస్తుంది.
ఇక కెపాసిటర్‌ని మార్చడం అనేది కష్టమైన విషయం కాదు. మీరే మార్చవచ్చు. కెపాసిటర్ ఫ్యాన్ మోటర్ మీద ఉంటుంది. ఇక పాత కెపాసిటర్‌ను తొలగించేముందు దానికి ఉన్న వైర్లు ఎలా ఉన్నాయో గమనించాలి. ఆ తరువాత సరిగ్గా అలాగే కొత్త కెపాసిటర్‌ను సెట్ చేయాలి. ఆ తరువాత ఫ్యాన్ ఆన్ చేసి, వేగంగా తిరగడాన్ని గమనించవచ్చు.
Also Read: “లావుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ఎందుకు ఇష్టపడరు..?” అని ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకి… ఆ అబ్బాయి చెప్పిన సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే..!
End of Article