Ads
ఈ మధ్య ప్రపంచం చాలా చిన్నదైపోయింది. విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న వారు కూడా ఎక్కువే ఉన్నారు. ఇక్కడి విధానాలు.. అక్కడి విధానాలు కంపేర్ చేసుకోవడం అనేది కూడా సహజం గానే జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇండియా నుంచి చదువుకోవడానికో.. లేక ఉద్యోగం చేయడానికే అమెరికా వంటి ఇతర దేశాలకు వెళ్లేవారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.
Video Advertisement
తాజాగా.. అలాంటి పరిస్థితి ముగ్ధ అనే ఓ అమ్మాయికి ఎదురైంది. పేరుకు తగ్గట్లే అందం గా ఉండేది. ఎమ్మెస్ చేయడం అనేది తన కల. అది నెరవేర్చుకోవడానికి కొన్ని నెలల క్రితమే అమెరికా కు వెళ్ళింది. అయితే.. అక్కడి వారిలో చాలా మంది ఇండియన్స్ ను చులకన గా చూస్తూ ఉంటారని ఆమెకు అర్ధం కావడానికి ఎక్కువసేపు పట్టలేదు. తన ఫ్రెండ్స్ లోనే అలాంటి వారిని చూసింది ఆ అమ్మాయి.
ముగ్ధ ఫ్రెండ్స్ లో జోసెఫ్ ఒకడు. టాపర్ అయిన ముగ్ధ ను అవకాశం దొరికినప్పుడల్లా అవమానించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఓసారి పార్టీ లో ఇద్దరు కలుసుకోవాల్సి వచ్చింది. డిన్నర్ చేస్తూ ముక్తసరి గా మాట్లాడుతున్న ముగ్ధను కావాలనే జోసెఫ్ డిస్టర్బ్ చేస్తాడు. ఇండియన్స్ కు పరిశుభ్రత ఉండదు.. అంటూ ఇండియన్స్ ని చులకన చేసి మాట్లాడతాడు. చివరకు టాయిలెట్ కి వెళ్లినా టిష్యూ పేపర్ వాడడం చేతకాదని.. వాటర్ తో చేత్తోనే కడిగేసుకుంటారని.. అస్సలు శుభ్రత ఉండదని నోటికొచ్చినట్లు వాగేస్తాడు.
జోసెఫ్ కి ఎలా అయినా గుణపాఠం చెప్పాలి అని ముగ్ధ ఫిక్స్ అయిపోతుంది. అప్పటికే రెండోసారి ఆర్డర్ చేసిన ఫుడ్ ఆర్డర్ రావడం తో ఇదే అదను అనుకుంటుంది. జోసెఫ్ తిన్న ప్లేట్ ని వెయిటర్ తీయబోతుండగా.. వద్దని వారిస్తుంది. ఒక టిష్యూ పేపర్ ఇచ్చి దానితోనే తుడిచి క్లీన్ చేసి అదే ప్లేట్ లో ఫుడ్ పెట్టమని చెబుతుంది. జోసెఫ్ ముఖం లో రంగులు మారతాయి. ప్లేట్ ని కడగకుండా ఎలా తినాలి..? అంటూ జోసెఫ్ అయిష్టం గా ముఖం పెడతాడు.
జస్ట్ నువ్వు తిన్న ప్లేట్ లో తినడానికే దాన్ని వాటర్ తోనే కడగాలి అని అనుకుంటున్నావు. టిష్యూ పేపర్ తో తుడిస్తే.. అది పూర్తి గా శుభ్రం అవ్వదు అన్న విషయం నీక్కూడా తెలుసు. అలాంటిది శరీరం విడుదల చేసే వ్యర్ధ పదార్ధాల నుంచి మన దేహాన్ని శుభ్రపరుచుకోవడానికి మాత్రం టిష్యూ పేపర్ సరిపోతుంది అని ఎలా అంటావ్..? అని నిలదీస్తుంది. మా పెద్దలు ఎంతో ఆలోచించి.. ఆరోగ్యకరమైన విధానాలను రూపొందించారు. ఇంకోసారి ఇండియన్స్ ని హేళన చేస్తే మర్యాదగా ఉండదు అంటూ కౌంటర్ ఇస్తుంది. అక్కడివారందరు చప్పట్లు కొట్టి ఆమెను అభినందిస్తారు.
End of Article