భారతదేశపు మొదటి AC రైలు చూశారా..? ఇందులో చల్లదనం రావడానికి ఏం చేసేవారో తెలుసా..?

భారతదేశపు మొదటి AC రైలు చూశారా..? ఇందులో చల్లదనం రావడానికి ఏం చేసేవారో తెలుసా..?

by Mohana Priya

Ads

ఇప్పట్లో ఉన్న రైళ్లకు ఏసీ కోచ్‌లు సర్వసాధారణం. నిజానికి మనదేశంలో ఏసీ కోచ్ ఎప్పటినుంచి మనుగడలో ఉందో మీకు తెలుసా? అవి ఎలా పనిచేసేవో మీకు ఐడియా ఉందా? 1934లో దేశ విభజనకు ముందు మనకు స్వాతంత్రం కూడా రావడానికి ముందు భారతదేశంలో మొట్టమొదటి ఏసీ రైలు ప్రవేశపెట్టడం జరిగింది.

Video Advertisement

అప్పట్లో ఉన్న రైళ్లకు ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ అని కంపార్ట్మెంట్లు విభజించి ఉంచేవారు. ఫస్ట్ క్లాస్‌లో కేవలం బ్రిటిష్ వారు మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉండేది.

indian old ac train

కాబట్టి వారి కోసం చల్లగా ఉన్నటువంటి కోచ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ కారణం వల్ల ఏసీ కోచ్ వ్యవస్థ భారత రైల్వేలో మొదలైంది. ఇందుకోసం పెద్దపెద్ద ఐసు బ్లాక్‌లను రైల్ ప్లోర్‌లోనే ఉంచేవారంట.సెప్టెంబర్ 1 1928,ముంబైలోని బల్లార్డ్ పీర్ స్టేషన్ నుంచి ఢిల్లీ, బటిండా, ఫిరోజ్‌పూర్, లాహోర్ మీదుగా పెషావర్ వరకు వెళ్లి రైలులో దీన్ని అమర్చారు.

indian old ac train

ఆ తర్వాత 1930లో ఈ రైలును సహరాన్‌పూర్, అంబాలా, అమృత్‌సర్, లాహోర్‌ ప్రాంతాల మీదుగా వెళ్లడానికి మళ్ళించారు. ఇందులో ముందుగా అమర్చినటువంటి ఐస్ బ్లాక్స్ కారణంగా భోగి మొత్తం చ ల్లగా ఉండేది. ఈ రైలు పేరు ఫ్రాంటియర్ మెయిల్ అయితే దీనిని 1996లో గోల్డెన్ టెంపుల్ మెయిల్ అని మార్చారు. ఇది బ్రిటిష్ కాలం నాటి అత్యంత లగ్జరీ రైలుగా గుర్తింపు పొందినది. అప్పట్లో స్టీమ్ తో నడిచే ఈ రైలు వేగం సుమారు గంటకు 60 కిలోమీటర్లు.

indian old ac train

ప్రస్తుతం ఇది ఎలక్ట్రిసిటీతో నడుస్తోంది దీనికి ఆధునిక హంగులు మరియు ఏసీ వసతులు కూడా కల్పించారు. ఈ రైలు ప్రస్తుతం 1,893 కి.మీల దూరం ప్రయాణించడంతోపాటు 35 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. 24 కోచ్‌లు ఉన్నా ఈ రైలులో సుమారు 1300 మంది ప్రయాణం చేయవచ్చు. దాదాపు ఈ రైలుకి 95 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి అయినా ఇప్పటికీ ఎంతో దృఢంగా ఉంది.

ALSO READ : టమోటాల ధరల గురించి బాలకృష్ణ సినిమాలో అప్పుడే చెప్పారా..?


End of Article

You may also like