జపాన్, చైనా, కొరియా దేశాలలో రాత్రిపూట మాత్రమే స్నానం చేస్తారు..మనలాగ ఉదయం ఎందుకు చేయరంటే.?

జపాన్, చైనా, కొరియా దేశాలలో రాత్రిపూట మాత్రమే స్నానం చేస్తారు..మనలాగ ఉదయం ఎందుకు చేయరంటే.?

by kavitha

Ads

భారతీయులు పూర్వకాలం నుండి ఉదయాన్నే స్నానం చేయడం వల్ల వారి రోజు శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు. పూర్వకాలం నుండి ఇది సంప్రదాయంగా మారిపోయింది. అందువల్ల భారతీయులు స్నానం చేయడంతో  వారి రోజును మొదలుపెడతారు. ఇలా చేయడం వెనుక సంప్రదాయాలు, మత విశ్వాసాలు ఉన్నాయి.

Video Advertisement

అయితే ఇతర ఆసియా దేశాలు అయిన జపాన్, చైనా, కొరియా లాంటి దేశాల్లో మాత్రం రాత్రి వేళ స్నానాలు చేస్తుంటారు. ఇలా చేయడం వెనుక ఉన్న కారణం కారణం ఏమిటో? సైన్స్ మరియు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

జపాన్‌లో పురాతన కాలం నుండి రాత్రివేళ స్నానం చేసే ఆచారం ఉంది. రాత్రివేళ స్నానం చేయడం ద్వారా పగటివేళ శరీరంలో పేరుకున్న మలినాలు మరియు టాక్సిన్స్ పోగొట్టడానికి సహాయపడుతుందని, తద్వారా శరీరానికి విశ్రాంతి లభిస్తుందని నమ్ముతారు. రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల మనస్సు, శరీరం రెండూ శుభ్రపడతాయని వారి నమ్మకం. ఈ కారణంగా, స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోతామని నమ్ముతారు. రాత్రిపూట స్నానం చేయడానికి మరో రీజన్, జపనీస్ కార్మికులు ఒత్తిడితో కూడిన పనులు చేస్తుంటారు.

నిద్రకు ముందు స్నానం చేయడం వల్ల పని పూర్తి అయ్యిందని,  విశ్రాంతి తీసుకోవడానికి సమయం వచ్చిందని శరీరానికి సూచించే మార్గం. ఇలా చేయడం వల్ల ఒత్తిడిని తగ్గి, మానసిక, శారీరక విశ్రాంతిని పెంచుతుంది. దక్షిణ కొరియా ప్రజలు చాలా గంటల పని తర్వాత రెస్ట్ తీసుకోవడానికి రాత్రివేళ స్నానం చేయడానికి ఇష్టపడతారు. చైనా సంస్కృతిలో, రాత్రివేళ స్నానం చేయడం పరిశుభ్రతలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రాత్రి స్నానం వల్ల పగటి సమయంలో శరీరంలో పేరుకున్న క్రిములను నాశనం చేస్తుందని విశ్వసిస్తారు. చైనా వాతావరణం చాలా తేమగా, తేలికపాటిగా ఉంటుంది. అందువల్ల  స్కిన్  పై బ్యాక్టీరియా, దుమ్ము పేరుకుపోతుంది. రాత్రి పూట స్నానం చేయడం వల్ల శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాక ఇన్ఫెక్షన్ల వంటివి వ్యాప్తి చెందకుండా ఉంటాయి.

ఉదయం పూట స్నానం  వల్ల కలిగే ప్రయోజనాలు..

ఉదయపు స్నానం ప్రారంభానికి  కావాల్సిన శక్తిని ఇస్తుంది

రాత్రిపూట కలిగిన హ్యాంగోవర్‌ను తొలగించి, ఫ్రెష్ నెస్ ను ఇస్తుంది

మరింత యాక్టివ్ గా ఉన్న అనుభూతి కలుగుతుంది.

రాత్రి నిద్రించే టైమ్ లో చెమట ఎక్కువగా వచ్చేవారు తప్పనిసరి ఉదయం స్నానం చేయాల్సి ఉంటుంది.

రాత్రిపూట స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు..

రాత్రిపూట స్నానం చేయడం వల్ల చెమట, ధూళిని పోగొడుగుతుంది.

రాత్రిపూట స్నానం వల్ల బెడ్‌షీట్‌ల పై నూనె, మురికి తక్కువగా చేరుతుంది.

రాత్రిపూట స్నానం చేయడం వల్ల స్కిన్ హెల్త్ మెరుగ్గా ఉంటుంది.

ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

సైన్స్ ఏం చెబుతోందంటే..?
సైన్స్ మరియు నిపుణులు సైతం రాత్రి స్నానానికి మద్దతు తెలుపుతున్నారు. రోజంతా పని చేసిన తర్వాత రాత్రిపూట స్నానం చేయడం ద్వారా శరీరం రిఫ్రెష్ అవుతుంది. రోజంతా అలసిపోయిన వారు తలస్నానం చేయడం వల్ల నిమిషాల్లో అలసటను తగ్గించుకోవచ్చు. నిద్ర బాగా పడుతుంది. రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

Also Read: వేసవిలో చల్లనీరు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సిందే!


End of Article

You may also like