ఆస్కార్ అవార్డులంటే ఒకప్పుడు మనవాళ్లు అందని ద్రాక్షగా భావించే వాళ్లు. గెలవడం వరకు పక్కనపెడితే కనీసం నామినేషన్ వరకు కూడా వెళ్లింది చాలా తక్కువ. అయితే ఈ ఏడాది మూడు భారత చిత్రాలకు ఈ సారి అవకాశం లభించింది. ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో గా.. ఆల్ దట్ భ్రీథ్స్ అనే డాక్యూమెంటరీ, ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే షార్ట్ ఫిల్మ్ ఈ నామినేషన్స్ లో అవకాశం దక్కించుకున్నాయి.

Video Advertisement

1929లో ఆస్కార్ అవార్డులు ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ చిత్రాలు అత్యధికంగా నామినేట్ కావడం ఇదే మొదటి సారి. అయితే ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లడమే గగనం అయ్యిన తరుణం లో కొంత మంది మాత్రం అకాడమీ అవార్డులను సైతం ఒడిసిపట్టుకున్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

#1 భాను అతియా

మహారాష్ట్రా కోల్హాపుర్‌ కి చెందిన భాను ఆర్టిస్ట్ కావాలనుకున్నారు. కానీ కాస్ట్యూమ్ డిజైనర్ గా మారి ఎన్నో బాలీవుడ్ చిత్రాలకు పని చేసారు. 1982లో తెరకెక్కిన గాంధీ సినిమాతో ఆమె అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్నారు. విలియం అటెన్ బరో తెరకెక్కించిన ఈ సినిమాకు ఆమెకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ వచ్చింది.

Indians who won the Oscars..!!

భారత్‌కు ఇదే తొలి అకాడమీ అవార్డు. 100కిపైగా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన భాను ఆతియా రెండు జాతీయ పురస్కారాలను కూడా గెలుచుకున్నారు.

#2 సత్యజిత్ రే

భారత చలనచిత్ర రంగ చరిత్రలోనే సత్య జీత్ రే పేరు సువర్ణ అక్షరాలతో లిఖించారు. 1992లో ఆయనకు అకాడమీ అవార్డు లభించింది. హానరీ ఆస్కార్ 1992 లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును గెల్చుకున్నారు రే. అనారోగ్య కారణాల వాళ్ళ ఆయన నేరుగా ఈ పురస్కారాన్ని అందుకోలేదు. సత్యజిత్ రే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకున్నారు. 1955లో కెన్నస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ హ్యుమన్ డాక్యుమెంట్ కూడా అవార్డు లభించింది.

Indians who won the Oscars..!!

#3 రసూల్ పూకుట్టి

2008లో విడుదలైన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఇయాన్ టాప్, రిచర్డ్ ప్రైక్, రసూల్ పూకుట్టికి సంయుక్తంగా ఆస్కార్ అవార్డు లభించింది. రసూల్ హిందీ, తమిళం, తెలుగులో పలు చిత్రాలకు పనిచేశారు. 2009లో వచ్చిన కేరలవా వర్మ పళాసిరాజ అనే సినిమాకు జాతీయ అవార్డును కూడా గెల్చుకున్నారు.

Indians who won the Oscars..!!

#4 ఏఆర్ రెహమాన్

స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డులను గెల్చుకున్నారు రెహమాన్. రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డు గెల్చుకున్న మొదటి భారతీయుడిగా ఏఆర్ రెహమాన్ చరిత్ర సృష్టించారు. తమిళం, హిందీ, తెలుగులో చాలా చిత్రాలకు సంగీతాన్ని అందించిన రెహమాన్.. పలు అంతర్జాతీయ సినిమాలకు కూడా స్వరాలను సమకూర్చారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాకు గానూ.. నేషనల్ అవార్డు అందుకున్నారు.

Indians who won the Oscars..!!

#5 గుల్జార్

జయహో.. ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది అప్పట్లో.. ఎఆర్ రెహమాన్ ఈ పాట కంపోజ్ చేశారు. ఇందుకు ఆయనకు రెండో ఆస్కార్ తెచ్చిపెట్టింది. ఈ పాటకు ప్రముఖ లిరికిస్ట్ గుల్జర్ లిరిక్స్ రాశారు.బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ రాసినందుకు గుల్జర్ ఆస్కార్ అవార్డును గెల్చుకున్నారు.

Indians who won the Oscars..!!

#6 కీరవాణి & చంద్రబోస్

ఇక లేటెస్ట్‌గా 95 వ ఆస్కార్ అవార్డ్ కార్యక్రమంలో తెలుగు సినిమా ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయ్యి సరికొత్త చరిత్రను సృష్టించింది. నాటు నాటు సాంగ్ కి గాను ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.

Indians who won the Oscars..!!

#7 కార్తీకి గాన్ స్లేవ్స్ & గునీత్ మెంగా

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌‌గా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను గెలుచుకుంది. ఇది ఇండియా నుంచి నామినేట్ అయిన డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్. దీనికి గాను నిర్మాతలు కార్తీకి గాన్ స్లేవ్స్, గునీత్ మెంగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.

Indians who won the Oscars..!!