1975లో ఎమర్జెన్సీ విధించాలి అని ఇందిరా గాంధీకి ఎవరు చెప్పారు..? అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..?

1975లో ఎమర్జెన్సీ విధించాలి అని ఇందిరా గాంధీకి ఎవరు చెప్పారు..? అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..?

by Mounika Singaluri

Ads

1975 జూన్ 25వ తారీఖున ఉదయం ఢిల్లీలోని బంగా భవన్ లో పడుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రాయ్ ఫోన్ మోగింది. ఫోన్ లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పర్సనల్ సెక్రటరీ ఆర్కే ధావన్ రాయ్ నీ ప్రధానమంత్రి నివాసానికి రావాలని చెప్పారు. ఆయన ఇందిరా గాంధీ నివాసానికి చేరుకునే సమయానికి ఒక గదిలో టేబుల్ ముందు ఇందిరా గాంధీ కూర్చుని ఉన్నారు. ఆమె టేబుల్ మీద నిఘా వర్గాల రిపోర్టులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.

Video Advertisement

రెండు గంటలపాటు ఇందిరాగాంధీ దేశ పరిస్థితులపై మాట్లాడారు. దేశంలో అరాచకం జరగబోతుంది అంటూ తెలిపారు. గుజరాత్, బీహార్ అసెంబ్లీలను రద్దు చేశారు. విపక్షాల డిమాండ్ ల కైతే అడ్డే లేకుండా పోయింది. అయితే మనం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఇందిరా తెలిపారు.

రాజ్యాంగ అంశాల్లో నిపుణులుగా భావించే రాయ్ ని పిలిపించారు తప్ప అప్పటి న్యాయశాఖ మంత్రి హెచ్.ఆర్ గొక్లే తో దానిపైన ఎలాంటి చర్చలు జరపలేదు. ఒకసారి రాజ్యాంగ పరిస్థితిని తెలుసుకోవస్తానని రాయ్ ఇందిరాతో చెప్పగా త్వరగా రావాలని ఇందిరా అన్నారు.
భారత రాజ్యాంగం తో పాటు అమెరికా రాజ్యాంగం పైన దృష్టి పెట్టిన రాయ్ మళ్లీ మధ్యాహ్నం మూడు గంటలకు ఇందిరా నివాసానికి వెళ్లారు. అంతర్గత సమస్యల నుండి బయటపడి సెక్షన్ 350 కింద ఎమర్జెన్సీ విధించవచ్చని రాయ్ తెలిపారు.క్యాబినెట్ కి ఎమర్జెన్సీ విషయం చెప్పనని ఇందిరా చెప్పగా, దానికి అంత సమయం లేదని మీరు ఈ విషయాన్ని రాష్ట్రపతికి చెప్పవచ్చని రాయ్ ఇందిరాకి సూచించారు. ఆ ప్రతిపాదనతో రాష్ట్రపతి వద్దకు వెళ్లాలని ఇందిరా రాయ్  ని కోరారు.

కానీ రాయ్ నేను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని దాన్ని నిరాకరించారు. అయితే ఇందిరా తన వెంట రావాలని కోరగా ఇద్దరు కలిసి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వద్దకు చేరుకుని మొత్తం విషయాన్ని వివరించారు. అయితే రాష్ట్రపతి ఎమర్జెన్సీ పత్రాలు పంపాలని ఇందిరాకు తెలిపారు. ఇద్దరూ తిరిగి ఇందిరా నివాసానికి వెళ్లారు. అప్పుడు రాయ్ ఇందిరా గాంధీ సెక్రటరీ  ధవన్ కు ఈ విషయం గురించి మొత్తం వివరించారు.ధవన్ తన టైపిస్ట్ లను పిలిపించి ఎమర్జెన్సీ ప్రతిపాదనల పత్రాలు సిద్దం చేయించారు. తర్వాత ఆ కాగితాలతో రాష్టప్రతి భవన్ చేరుకున్నారు. కేబినెట్ మంత్రులకు ఫోన్ చేసి ఉదయం 6 గంటలకు కేబినెట్ మీటింగ్ ఉంది అని చెప్పమని ఇందిరా సూచించారు.

 

అయితే అర్థ రాత్రి అయిన కూడా రాయ్ ఇందిరా నివాసంలోనే ఉన్నారు.కేబినెట్ మీటింగ్ తర్వాత రేడియోలో ఇందిరా ఇవ్వనున్న ప్రసంగానికి మెరుగులు దిద్దుతున్నారు.ఇంకో గదిలో సంజయ్ గాంధీ ఓం మెహతా తో కలిసి అరెస్ట్ చెయ్యవలసిన వారి లిస్ట్ తయారు చేస్తున్నారు.పేర్ల కోసం ఇందిరా గాంధీని పిలిచి మాట్లాడారు. తర్వాత రోజు వార్త పత్రికలకు కరెంట్ కట్ చేసి సెన్సార్షిప్ అమలు చేయడం ఎలా అనే దాని పైన కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందిరా ప్రసంగాలు రూపం ఇచ్చారు. అప్పటికే తెల్లవారుజాము మూడయ్యింది.రాయ్ ఇందిరా వద్ద నుండి సెలవు తీసుకున్నారు.ఓం మెహతా ఎదురై పత్రికలకు కరెంట్ కట్ చేసే విషయం గురించి రాయ్ కి   చెప్పారు. రాయ్ ఇలా చేయడం కరెక్ట్ కాదని నేను దాని గురించి మాట్లాడలేదని అన్నారు.

వెంటనే రాయ్ వెనక్కి వెళ్లి ఇందిరా ని కలవాలని ధవన్ కి  చెప్పారు. ఇందిరా పడుకున్నారని ధవన్ చెప్పగా, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కలవాలని రాయ్ అన్నారు. ధవన్ సంసయిస్తూనే వెళ్లి ఇందిరా ని బయటికి తీసుకువచ్చారు. కరెంట్ కట్ చేసే విషయం గురించి చెప్పగానే ఇందిరా షాక్ అయ్యారని
కేథరిన్ ఫ్రాంక్ కు రాయ్ ఈ విషయాన్ని చెప్పారు.ఇందిరా రాయ్ ని వెయిట్ చేయమని చెప్పి వెళ్లి సంజయ్ కు కరెంట్ కట్ చేసే విషయం పైన రాయ్ వ్యతిరేకిస్తున్నారని ఫోన్ లో చెప్పారు. వెంటనే సంజయ్  రాయ్ ని అక్కడి నుండి పంపించేయండి, ఆయన ప్రతిదాన్ని చెడగొడుతున్నారు. ఆయనకు ఏమీ తెలియదు అని అన్నారు.ఇందిరా వచ్చేలోపు ఓం మెహతా రాయ్ కి కరెంట్ కట్ చేసే ప్రణాళిక సంజయ్ ది అని చెప్పారు. ఈ లోపు ఇందిరా తిరిగి వచ్చేసరికి ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి.

రాయ్ తో కరెంటు ఉంటుంది, కోర్టులు తెరిచి ఉంటాయని తెలిపారు. అంతా సర్దుకుంది అని రాయ్ తిరిగి వెళ్లారు. జూన్ 26 వేకువ జామున ఇందిరా పడుకోక ముందే అరెస్టులు మొదలయ్యాయి.మొట్ట మొదట జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇందిరా కాసేపు పడుకుని తెల్లవారుజామున క్యాబినెట్ సమావేశానికి వచ్చారు. ఆ సమావేశంలో 8 మంది మంత్రులు, 5 సహాయ మంత్రులు పాల్గొన్నారు. సమావేశానికి రాగానే అత్యవసర ప్రకటన గురించి, అరెస్టు చేసే నాయకుల జాబితా గురించి వివరించారు. ఏ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నామో చెప్పుకొచ్చారు. అప్పటి రక్షణ మంత్రి మాత్రమే దీన్ని వ్యతిరేకించి ఏ చట్టం కింద అరెస్టులు చేస్తున్నారంటూ ఇందిరాని ప్రశ్నించారు.

Also Read:ఈ మహిళ చేసే దాంట్లో ఏం తప్పు ఉంది..? ఎందుకు ఇలా కామెంట్స్ చేస్తున్నారు..?


End of Article

You may also like