చేపలు అమ్ముకునే స్టేజ్ నుంచి వ్యాపారవేత్తగా..! యువతి సక్సెస్ స్టోరీ..!

చేపలు అమ్ముకునే స్టేజ్ నుంచి వ్యాపారవేత్తగా..! యువతి సక్సెస్ స్టోరీ..!

by Anudeep

Ads

ఆమె కుటుంబంలో పెద్ద కూతురు. కుటుంబ పోషణకై బాధ్యతను తన భుజాలపై వేసుకొని తల్లితో కలిసి చేపలు అమ్మేది. జీవితంలో ఏదో సాధించాలనే సంకల్పంతో వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తాను అనుకున్నది సాధించి చూపింది. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారానికి అధిపతి అయ్యింది.

Video Advertisement

ఎన్నో ఆటుపోట్లను, విమర్శలను ఎదుర్కొంటూ విజయాన్ని సాధించిన ఈమె కథ ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇంతకు ఎవరు ఆమె.. ఆమె సాధించిన ఘనత ఏంటి అనే అసలు విషయాన్ని తెలుసుకుందాం..

ఆమె పేరు వినోదా చందావత్. భద్రాద్రి కొత్తగూడెం కి చెందిన  నిరుపేద కుటుంబంలో పుట్టిన వినోద ముగ్గురు అక్కాచెల్లెలులో పెద్దది. డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ లో సివిల్ కోచింగ్ తీసుకుంటూ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది వినోదా. తాను సాధించాల్సింది ఇంకా ఏదో ఉందని, తన లక్ష్యం  వ్యాపారం అని గ్రహించి మల్హరి మసాలాస్ అనే పేరుతో వ్యాపారం ప్రారంభించింది.

వినోద మొదటిగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఆహారం అందించే డబ్బావాలా వ్యాపారం ప్రారంభించింది. దానితో నష్టాలు రావడంతో మసాలా వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ప్రాజెక్టును మొదలుపెట్టింది. 2016లో మల్హరి మసాలాస్ తో తన వ్యాపారం మొదలు పెట్టిన వినోదా 20 మంది మహిళలకు ఉపాధి కల్పించింది. దానికోసం బ్యాంకు నుంచి 42 లక్షలు లోన్ తీసుకుంది. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ దగ్గర ఇంట్లో వాళ్ల దగ్గర కూడా కొంత సొమ్మును సేకరించింది.

ఈ డబ్బుతో  తన వ్యాపారానికి సంబంధించిన అడుగులు వేసింది. ముందుగా మార్కెట్ అధ్యయనం చేసి ఉచితంగా తన మసాలా ఉత్పత్తులను పంచేది. ఆ మసాలా ఉత్పత్తుల కాస్త ప్రజలకు నచ్చడంతో 24 రకాల మసాలాలు సరఫరా చేసే స్థాయికి ఎదిగింది వినోదా. అంతే కాకుండా మల్హరి మసాలాస్ తో పాటు నమస్తే కిచెన్ ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తుంది వినోదా .  పూటగడవడం కోసం చాపలు అమ్ముకునే అమ్మాయి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ తన వ్యాపారాన్ని కోట్ల రూపాయలకు ఎదిగేలా చేస్తుంది వినోదా. ఈమె కథ ఎంతో మందికి యువతకు ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం..

 

Source: http://dhunt.in/xOGX7?s=a&uu=0x016e94364408decb&ss=pd


End of Article

You may also like