ఎనిమిదో నెల ప్రెగ్నెన్సీ అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటిపట్టునే ఉండి టైం కి తింటూ, కావలసినంత విశ్రాంతి తీస్కుంటూ, పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటూ ఉంటారు చాలామంది. కాని సునైనా పటేల్ మాత్రం తుపాకి చేతపట్టి నక్సల్స్ ఏరివేసే పనిలో బిజిగా ఉంది. అది ఒక దండకారణ్యంలో నక్సల్స్ ని ఏరివేసే పనిలో ఉన్న సునైనా పటేల్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

Video Advertisement

చత్తీస్ గడ్ లో  దంతెవాడ ప్రాంతం గురించి తెలిసిందే కదా . నక్సల్స్ భారిగా ఉండే ప్రాంతం . అదే విధంగా ఎక్కువగా ఎన్కౌంటర్స్ జరిగే చోటు. అలాంటి ప్రదేశంలో నక్సల్స్ చర్యలను సమర్దంగా తిప్పికొట్టడానికి కొంతమంది ఒక బృందంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం . ఆ బృందం పేరు దంతేశ్వరి లఢకే. ఈ బృందంలో సభ్యురాలే సునైనా పటేలే.

ఈ బృందంలో చేరినప్పుడు సునైనా రెండు నెలల ప్రెగ్నెంట్ .ఇప్పుడు ఎనిమిదో నెల వచ్చింది . ఈ ఆరు నెలల కాలంగా అడవిలోనే ఉంటూ విధులు నిర్వర్తిస్తుంది. భుజాన కిట్ బ్యాగులు, చేతిలో తుపాకి పట్టుకుని నక్సల్స్ ఏరివేతలో నిమగ్నమైంది. ముప్పైమంది మహిళలతో ఏర్పరచిన యాంటీ నక్సల్స్ కమాండో యూనిట్లో సునైనా ఒకరు. మావో ప్రభావిత ప్రాంతాలు అయిన బస్తర్‌, దంతేవాడ ప్రాంతాల్లో ఈ మహిళా కమాండోలు విధులు నిర్వర్తిస్తున్నరు.

డ్యూటీలో చేరినప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడూ విధులకు హాజరు కాకుండా ఉండలేదని, అప్పగించిన పనిని చేయడమే తన బాధ్యతగా భావిస్తానని , అందుకె గర్భిణిని అయినప్పటకి విధులు నిర్వర్తించడమే తనకి ముఖ్యం అని చెప్పుకొచ్చింది.

గతంలో ఒక సారి ఇదే అడవుల్లో పెట్రోలింగ్ నిర్వహించే టైంలో సునైనాకు గర్బస్రావం జరిగింది, అప్పుడు తనకు రెండు నెలల గర్భం అని దంతెవాడ ఎస్పి అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. మళ్లీ గర్భం వచ్చినప్పటికి భయపడకుండా విధులు నిర్వర్తిస్తుందని అన్నారు. సమస్యలకు బెదరకుండా ముందుకు పోవడం అనేది సునైనా ని చూసి నేర్చుకోవచ్చని, దంతెవాడ లడకేలో పని చేయడానికి మరికొంతమంది సునైన ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

image source: ANI