“మహేష్ బాబు-రాజమౌళి” సినిమాపై బయటికి వచ్చిన 11 వార్తలు..! ఇందులో ఎన్ని నిజం అవుతాయో..?

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ అటు మహేష్ బాబు ఇటు రాజమౌళి ఇద్దరూ కూడా తాము కలిసి సినిమా చేస్తున్నామనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతానికి మహేష్ బాబు త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ తరువాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా ప్రారంభించనున్నారు.

rajamouli-mahesh babu movie updates
వచ్చే యేడాది సమ్మర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

#1 వెయ్యి కోట్ల బడ్జెట్

rajamouli-mahesh babu movie updates

అందరు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి వెయ్యి కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారని సమాచారం. అలా అయితే ఇది భారత దేశంలోనే మొదటి వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా అవుతుంది.

#2 ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక యాత్రికుడు

rajamouli-mahesh babu movie updates
టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి అక్కడే తన తదుపరి చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి మహేష్ బాబుతో చేసే సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక ప్రపంచ యాత్రికుడి కధ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్నామని ఆయన అన్నారు.

#3 హాలీవుడ్ చిత్రం ఇన్స్పిరేషన్

rajamouli-mahesh babu movie updates
హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం అయినా ఇండియానా జోన్స్ చిత్రం ఆధారం గా ఈ మూవీ ని తీస్తున్నట్లు తెలుస్తోంది.

#4 మహేష్ రెమ్యూనరేషన్

rajamouli-mahesh babu movie updates
ఈ చిత్రానికి గాను మహేష్ బాబు భారీ మొత్తం లో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో మహేష్ ఇండియా లోనే నెంబర్ వన్ గా నిలుస్తాడు.

#5 క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ తో రాజమౌళి డీల్

rajamouli-mahesh babu movie updates
రాజమౌళి ఇప్ప‌టికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ తో చేతులు క‌లిపిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ప్ర‌ముఖ‌ హాలీవుడ్ న‌టీన‌టుల‌ను ఈ సినిమాలో న‌టింప చేయ‌టానికి ఒప్పిస్తుంది. ఈ సంస్థ‌తో జ‌క్క‌న్న డీల్ కుదుర్చుకున్నార‌ని తెలియ‌గానే, మూవీ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

#6 అమెరికన్ యాక్టర్ శామ్యూల్ ఎల్ జాక్సన్

rajamouli-mahesh babu movie updates
ఎవెంజర్స్​, స్టార్​ వార్స్​, ఎక్స్​ఎక్స్​ఎక్స్​, జురాసిక్​ పార్క్​, స్పైడర్​ మ్యాన్, కెప్టెన్​ అమెరికా​ వంటి సూపర్ హిట్​ చిత్రాల్లో నటించిన హాలీవుడ్ యాక్టర్ శామ్యూల్​ ఎల్​ జాక్స్​ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నటుడు ప్రతి సినిమాకు రూ.80 కోట్లు నుంచి 160 కోట్లు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తాడు. రాజమౌళి సినిమాలో ఇతడు ఉన్నాడో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

#7 థోర్ క్రిస్ హెమ్స్‌వ‌ర్త్

rajamouli-mahesh babu movie updates
థోర్ సినిమాలో హీరోగా న‌టించిన హాలీవుడ్ యాక్ట‌ర్ క్రిస్ హెమ్స్‌వ‌ర్త్ మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాలో గెస్ట్ రోల్ చేయ‌బోతున్నార‌ట‌. మ‌రి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

#8 విదేశాలకు చెందిన నటులు

rajamouli-mahesh babu movie updates
యాక్షన్ అడ్వెంచర్ అయినా ఈ చిత్రం లో మహేష్ ప్రపంచం లోని చాలా ప్రాంతాలు తిరుగుతారు కాబట్టి వివిధ దేశాలకు చెందిన నటులు ఇందులో నటిస్తున్నట్లు సమాచారం.

#9 జంతువులతో సన్నివేశాలు

mahesh babu record remunaration

ఈ చిత్రంలో చాలా జంతువులతో కూడిన సన్నివేశాలు ఉంటాయి. నీటి లోపల అత్యంత అద్భుతమైన సన్నివేశాలను రూపొందించడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది.

#10 జోనర్

ఈ జోనర్ లో వచ్చే మొదటి భారతీయ చిత్రం.

#11 హీరోయిన్

rajamouli-mahesh babu movie updates
ఈ సినిమాలో మహేశ్ జోడిగా శ్రద్ధ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మరో వైపు అలియా భట్, దీపికా పదుకొనె పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చిత్రబృందం ఎటువంటి ప్రకటన చేయలేదు. దీపికా కు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి ఆమె వైపే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం..

rajamouli-mahesh babu movie updates

ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు, హీరో, నిర్మాత ఎవరనే విషయం మీద క్లారిటీ వచ్చింది, కానీ మిగతా టెక్నీషియన్లు అలాగే నటీనటుల విషయం మీద ఎలాంటి క్లారిటీ రాలేదు.