Ads
జనాలు ఎక్కువ బస్సు ప్రయాణాల కంటే ట్రైన్ ప్రయాణం ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. జన సందోహం ఉన్న ప్రదేశాలలో ట్రైన్ వెళ్లదు కాబట్టి వాతావరణం కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అయితే రైల్వేకి సంబంధించిన కొన్ని విషయాలు మనకి తెలియవు. మన ఇండియన్ రైల్వేస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
# నిద్రపోయేటప్పుడు, లేదా విశ్రాంతి తీసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండటానికి ట్రైన్ డిజైనింగ్ సమయంలో కోచ్ యొక్క రేసోనన్స్ ఫ్రీక్వెన్సీ 72 బిపిఎమ్ లేదా 1.2 హెర్ట్జ్ కి దగ్గరలో ఉండేలాగా చూసుకుంటారు.
# జమ్మూ అండ్ కాశ్మీర్ లో రియాసి జిల్లాలో నిర్మాణంలో ఉన్న చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా నిర్మించిన తర్వాత ప్రపంచంలోని ఎత్తైన రైలు వంతెనలలో ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
# నాగ్‌పూర్ లోని డైమండ్ క్రాసింగ్ అని పిలవబడే ఒక రైల్వే ట్రాక్ మీద ట్రైన్లు అన్ని దిక్కుల్లో అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కుల్లో ప్రయాణం చేస్తాయి.
# 14 లక్షల మంది ఉద్యోగులతో భారత రైల్వే ప్రపంచంలోనే ఎనిమిదవ స్థానంలో ఉంది.
# డార్జిలింగ్ లో ఉన్న ఎంతో పేరుపొందిన టాయ్ ట్రైన్ ఇప్పటికీ కూడా స్టీమ్ ఇంజన్ తో నడుస్తుంది. దీనిని 1881 లో భారతదేశ బ్రిటిష్ కొలోనియల్ మాస్టర్ నిర్మించారు.
# భారతీయ రైల్వే ప్రతిరోజూ 19,000 రైళ్లను నడుపుతుంది. అందులో 12,000 రైళ్లు మనుషులు ప్రయాణం చేయడానికి మరియు 7,000 రైళ్లు వస్తువుల రవాణాకు కేటాయించబడ్డాయి.
# భారతీయ రైల్వే యొక్క ట్రాక్ పొడవు ఈక్వేటర్ (భూమధ్యరేఖ)ను ఒకటిన్నర సార్లు చుట్టేంత ఉంటుంది.
# నవపూర్ రైల్వే స్టేషన్ 2 రాష్ట్రాల్లో నిర్మించబడింది. అందులో ఒక సగం మహారాష్ట్రలో, మిగిలిన సగం గుజరాత్‌లో ఉంటుంది.
# భవానీ మండి అనే మరో స్టేషన్‌ను రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో విభజించారు.
# ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ భారతదేశంలో అత్యధికంగా విజిట్ చేసిన రెండవ వెబ్‌సైట్.
# మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో శ్రీరాంపూర్, బేలాపూర్ అనే రెండు వేరు వేరు స్టేషన్స్ ఉన్నాయి. కానీ ఆ స్టేషన్స్ రైల్వే రూట్ ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా ఉంటుంది.
# ఒక ప్రయాణికుడికి కోపం వచ్చి ఉత్తరం రాసేంత వరకు దాదాపు 50 సంవత్సరాల దాకా ఇండియన్ రైల్వేలో టాయిలెట్స్ లేవు.
End of Article