ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ భవనం గురించి మీకు తెలుసా.. అది ఎవరిదంటే..?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ భవనం గురించి మీకు తెలుసా.. అది ఎవరిదంటే..?

by Mounika Singaluri

Ads

ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి చాలా ఉంటాయి. ఖరీదైన వస్తువులను వాడేందుకు ధనవంతులు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎక్కువగా ధనవంతులే అత్యంత విలువైన వస్తులను వాడుతూ.. లగ్జరీగా జీవిస్తారు.

Video Advertisement

వారు ఎక్కడికెళ్లినా, ఏది వాడినా అందరిలో ప్రత్యేకంగా కనిపించేందుకు లగ్జరీ వస్తువులను వాడుతూ ఉంటారు. అయితే ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు వజ్రాలు, బంగారం లాంటివి. అత్యంత ఖరీదైన ప్రదేశాలు, వస్తువులు కూడా ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు గురించి
ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ఫ్రెంచ్ రాజ కుటుంబ అధికారిక నివాసం వెర్సెల్లెస్ ప్యాలెస్ ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన భ‌వ‌నంగా గుర్తించారు. ప్ర‌స్తుతం దీనిని మ్యూజియంగా మార్చారు. చాటేయి లూయిస్ భ‌వ‌నం య‌జ‌మాని గురించి ప్ర‌స్తుతం అధికారికంగా ఎలాంటి స‌మాచారం తెలియ‌దు. అలాగే దీనిలో ఒక‌రోజు ఉండాలంటే ఎంత డ‌బ్బు చెల్లించాలి అనే సమాచారం కూడా రికార్డుల్లో లేదు. ఈ భ‌వ‌నం దాదాపు 7 వేల చ‌ద‌ర‌పు మీట‌ర్ల‌లో ఈ ప్యాలెస్ విస్త‌రించి ఉంది.

 

 

2015లో ఓ కొనుగోలుదారుడు దీనిని 275 మిలియ‌న్ యూరోల‌కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్ర‌పంచంలోనే అత్యంత పాపుల‌ర్ అయిన ఫార్చ్యూన్ మ్యాగ‌జైన్ దీనిని ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన, ఖ‌రీదైన ఇల్లుగా గుర్తించింది. అలాగే 2017లో ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ భవనం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కు చెందినదిగా గుర్తించినట్లు తెలిసింది.

 

నకిలీ కంపెనీల ద్వారా ఈ భవనాన్ని అక్రమంగా కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఫ్రాన్స్, సౌదీ అరేబియా తెలిపింది. ఆ కథనాన్ని తీవ్రంగా ఖండించింది. చాటేయి లాయిస్ భవనాన్ని జమాల్ ఖషోగ్గి బంధువు ఇమాద్ ఖసోగ్గి లాయిస్ నిర్మించాడు.

 

 

ఫ్రాన్స్ లో అత్యంత లగ్జరీ ప్రాపర్టీ డెవలప్ మెంట్ బిజినెస్ ను ఇతడు నడుపుతున్నాడు. ఇందులో నైట్ క్లబ్ తో పాటు సినిమాహాల్, గోల్డ్ లీఫ్ ఫౌంటెన్ ఉన్నాయి. ఈ భవనంలో నీటి అడుగున ఒక గది ఉంది.లోపలికి వెళితే ఆ గది అక్వేరియంలా కనిపిస్తూ ఉంటుంది. ఇవి ప్రపంచంలోనే ఖరీదైన భవనానికి సంబంధించిన వివరాలు.


End of Article

You may also like