తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు, రామ్ చరణ్ లు ఇద్దరూ స్టార్ కిడ్స్. అదే కాకుండా మహేష్ మరియు చరణ్ మంచి స్నేహితులు కూడా. సూపర్ స్టార్ కృష్ణగారి కుమారుడిగా మహేష్ బాబు చిన్నతనంలోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

Video Advertisement

బాల నటుడుగా ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. మహేష్ కి స్టార్ స్టేటస్ రావడానికి ఎక్కువ సమయమే పట్టింది. తోలి చిత్ర హీరోగా మొదటి సినిమాతోనే రికార్డ్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం స్టార్ హీరోగా మహేష్ దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. రెండు చిత్రాలతో స్టార్ హీరోగా మారాడు. ఇక రాజమౌళితో దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్  చిత్రంతో గ్లోబల్ స్టార్ గా మారాడు.
interesting-thing-about-mahesh-and-charan4 మహేష్ కూడా త్వరలోనే రాజమౌళి తెరకెక్కించే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. మహేష్, చరణ్ వలె వారి సతీమణులు నమ్రత, ఉపాసన కూడా మంచి స్నేహితులు. ఇక చరణ్, ఉపాసన దంపతులకు మహేష్ బాబు కుమార్తె సితార అంటే ఎంతో ఇష్టం. మహేష్, చరణ్ లు ఇద్దరూ ప్రేమించుకొని, ఆ తరువాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు.
అయితే మహేష్, చరణ్ లను తన అల్లుళ్ళుగా చేసుకోవాలని తెలుగు అగ్ర నిర్మాత అనుకున్నారంట. ఆ నిర్మాత పెద్ద కుమార్తెను మహేష్ బాబుకు, చిన్న కుమార్తెను రామ్ చరణ్ కు ఇచ్చి వివాహం చేయాలని భావించడంట. దీనికి కృష్ణ, చిరంజీవి కూడా ఒప్పుకున్నారని సమాచారం. అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మహేష్ బాబు, చరణ్ లు లవ్ మ్యారేజ్ కి సిద్ధం అయ్యారు. ఇక ఆ అగ్ర నిర్మాత కుమార్తెలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: మహేష్ బాబు నటించిన చిత్రాలలో నమ్రతకు ఆ సినిమా అస్సలు నచ్చదంట..