టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. తండ్రికి తగ్గ కుమారుడిగా మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి వంశీ అనే చిత్రంలో నటించారు.

Video Advertisement

ఈ చిత్రం షూటింగ్ టైమ్ లోనే మహేష్ నమ్రత పరిచయం, ఆ తరువాత ప్రేమగా మారింది. ఇద్దరు కూడా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. నమ్రత పెళ్లి అయిన తరువాత సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఆమె ఒక వైపు కుటుంబాన్ని చూసుకుంటూనే  ఇంకో వైపు వ్యాపారాలను కూడా చూసుకుంటున్నారు. ఇక మహేష్ బాబు కూడా తన ఫ్యామిలీకి ఎంతగా ప్రాముఖ్యతను ఇస్తాడో అందరికి తెలిసిందే. తన కుటుంబం తరువాతనే సినిమాలు అంటాడు.  namrata-says-she-dislikes-sainikudu-movie1సినిమా షూటింగ్స్ తో ఎల్లప్పుడూ బిజీగా ఉండే మహేష్ బాబు ఏమాత్రం విరామం దొరికినా నమ్రత, గౌతమ్, సితారల తో సమయాన్ని గడుపుతాడు. వాళ్ళతోనే ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇదిలా ఉండగా ఈ ఇటీవల నమ్రత ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు మళ్లీ నటిస్తారా? మహేష్ బాబు చిత్రంలో చిన్న క్యారెక్టర్ అయిన చేస్తారా అని అడిగినపుడు దానికి ఆమె చేయను అని చెప్పారు.namrata-says-she-dislikes-sainikudu-movie2ఇక మహేష్ నటించిన చిత్రాలలో మీకు నచ్చని మూవీ ఏమిటని అడిగితే సైనికుడు సినిమా నచ్చదని తెలిపింది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన సైనికుడు మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవి  విద్యార్ధులు రాజకీయాల్లోకి రావాలనే కథాంశంతో తెరకెక్కింది. ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీలో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.namrata-says-she-dislikes-sainikudu-movieAlso Read: బలగం చిత్రంలో ‘సాయిలు’ పాత్రకు ముందు అనుకున్నది ప్రియదర్శి కాదంట.. ఆ నటుడు ఎవరంటే..