సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. వరుస విజయలతో దూసుకుపోతోన్న మహేష్ కోసం ఈసారి గురూజీ ఓ డిఫరెంట్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడట త్రివిక్రమ్.

Video Advertisement

 

ఇప్పటికే మహేష్ సినిమా షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబుపై అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను, ఇంట్లో ఫైట్‌ను చిత్రీకరించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కథను గురూజీ మార్చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

interesting update about mahesh- trivikrm movie..!!

మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును మార్చుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫస్ట్ షెడ్యూల్‌లో చేసిన షూట్ మొత్తం వేస్ట్ అయిపోయిందని, దీనివల్ల యూనిట్‌కు కొన్ని కోట్ల నష్టం వచ్చిందని కూడా టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రం లో కీలకమైన మహేష్ తల్లి పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ శోభనను సంప్రదించారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

interesting update about mahesh- trivikrm movie..!!

ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. చాలా కాలం తర్వాత మహేష్- త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తుండటం తో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.