1945 నాటి కచేరి ఆహ్వాన పత్రిక చూశారా..? ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..?

1945 నాటి కచేరి ఆహ్వాన పత్రిక చూశారా..? ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..?

by Mohana Priya

Ads

సంగీతంలో ఎన్నో రకాలు ఉంటాయి. ప్రపంచమంతా కూడా సంగీతం మీద నడుస్తుంది. ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వారు సంగీతాన్ని వింటూ ఉంటారు. అయితే, వీటన్నిటిలో కూడా శాస్త్రీయ సంగీతం అంటే అందరికీ ఒక రకమైన గౌరవం వస్తుంది. శాస్త్రీయ సంగీతానికి మిగిలిన రకాల సంగీతాలతో పోలిస్తే ఎక్కువగా ప్రాచుర్యం ఉండదు. అందుకే శాస్త్రీయ సంగీతానికి గుర్తింపు తీసుకురావాలి అని ఎంతో మంది కృషి చేశారు. ఎన్నో సినిమాల్లో కూడా శాస్త్రీయ సంగీత విలువని అందరికీ చాటి చెప్పడానికి తమ వంతు కృషి చేశారు. కొంత మంది సంగీత దర్శకులు అయితే తమ సినిమాల్లో క్లాసికల్ ట్యూన్ ఉన్న పాటలు పెట్టుకుంటారు.

Video Advertisement

invitation for a singing program

కొంత మంది డైరెక్టర్లకి కూడా వాళ్ళ సినిమాలలో క్లాసికల్ మ్యూజిక్ తో ఉండే ఒక్క పాట అయినా ఉండాలి అని అనుకుంటారు. ఈ పైన ఫోటోలో ఉన్న వ్యక్తి శాస్త్రీయ సంగీతానికి నిలువెత్తు నిదర్శనం. శాస్త్రీయ సంగీతాన్ని అందరికీ అందించడానికి కృషి చేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఈయన తెలియని వారు ఉండరు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అంటే అందరికీ అభిమానంతో పాటు, గౌరవం కూడా ఉంటుంది. ఎన్నో వేల కచేరీలు బాలమురళీకృష్ణ గారు ఇచ్చారు. ఎన్నో ప్రోగ్రామ్స్ లో కూడా పాడారు. ఈ పైన ఉన్న ఫోటో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 1945 లో ఇచ్చిన కచేరీ కోసం చేసిన ఆహ్వాన పత్రిక. పక్కనే ఉన్న అబ్బాయి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.

“శ్రీ కుత్తాళం సిద్దేశ్వరి పీఠాధిపతులు, శ్రీ మత్పరమహంస పరివ్రజకాచార్య వర్యా శ్రీశ్రీ విమలానంద భారతి స్వాముల వారి యాధిపత్యమున, బందరు రామానాయుడుపేటలో, ఏప్రిల్ 18వ, తేదీ 1945, సాయంకాలం 6 గంటలకు గొప్ప పాటకచేరి. గాన సుధాకర, చిరంజీవి మంగళంపల్లి బాలమురళీకృష్ణ (గాత్రము). సంగీత విద్వాంసులు శ్రీ సరిదే సుబ్బారావు గారు, ఫిడేలు, మృదంగ విద్వాంసులు శ్రీ క్రొవ్విడి హనుమంతరావు గారు, మృదంగము. ఆహ్వాన సంఘము. రసతరంగిణి ప్రెస్, బెజవాడ. వెల 0-0.2” అని ఈ ఆహ్వాన పత్రిక మీద రాసి, పక్కనే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చిన్నప్పటి ఫోటో కూడా ఉంది. ఈ ఫోటోని కోరాలో హనుమంత బాబు గారు అనే ఒక మాజీ రిటైర్డ్ ఇంజనీర్ షేర్ చేశారు.


End of Article

You may also like