మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. మరో వైపు రానున్న సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో ఓ సినిమాలో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న కొత్త సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Video Advertisement

 

 

వాల్తేరు వీరయ్య’లో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో మాస్ మహారాజ రవితేజ యాక్ట్ చేశారు. ఈ చిత్రం లో చిరుకి తమ్ముడిగా రవి తేజ నటించారని తెలుస్తోంది. వారిద్దరూ కలిసి స్టెప్పులేసిన ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ ట్రేండింగ్ లో దూసుకుపోతోంది. ఆయన పాత్రకి సంబంధించిన టీజర్ ని ఇటీవల విడుదల చేయగా .. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

is catherine theresa in wateir veerayya movie..??

 

అయితే ఈ చిత్రం లో రవి తేజకి జోడీగా కేథరీన్ నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య సన్నివేశాలు కూడా చిత్రీకరించారని సమాచారం. అయితే ఇప్పటి వరకు కేథరిన్ తెర్సా కు సంబంధించిన ఒక్క ఫొటో కానీ.. విజువల్ కానీ వాల్తేరు వీరయ్య ప్రమోషన్ సందర్భంగా రివీల్ చేయలేదు. అసలు కేథరిన్ పాత్ర ను ఉంచారా లేదంటే లేపేశారా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రవితేజ పాత్ర పరిధి ఎక్కువ ఉండటం వల్ల కేథరిన్ యొక్క పాత్రను తొలగించి ఉంటారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

is catherine theresa in wateir veerayya movie..??

కేథరిన్ పాత్ర చిన్నదే అయినా కూడా ఆమెకు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు ప్రమోషనల్ ఈవెంట్స్ లో లేదంటే పోస్టర్స్ లో ఆమెను చూపించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆమెను ఒక్క సారి కూడా ప్రమోషనల్ స్టఫ్ లో చూపించలేదు. కనీసం ట్రైలర్ లో అయినా కేథరిన్ ను చూపిస్తారేమో చూడాలి. పాటల్లో మాత్రం కేథరిన్ కు ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో సినిమాలో ఆమె పాత్ర ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ పాటల్లో కనిపించకుంటే ఇక సినిమాలో ఆమె రోల్ చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని.. అందుకే తొలగించి కూడా ఉండే అవకాశం ఉంది అనిపిస్తుంది.