సమంత చెప్పడంతోనే… నాగ చైతన్య ఆ నిర్ణయం తీసుకున్నారా..?

సమంత చెప్పడంతోనే… నాగ చైతన్య ఆ నిర్ణయం తీసుకున్నారా..?

by Anudeep

Ads

ఏ మాయ చేసావే.. సినిమాలో జంటగా నటించి, నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగ చైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా “చైసామ్”  అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.

Video Advertisement

వీరి విడాకుల వార్తను అటు సామ్ అభిమానులు, ఇటు చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నోఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్నా ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అనేక మంది అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.

సమంత, నాగచైతన్య విడాకులకు ముందు చాలా సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన మనం, మజిలీ, ఏ మాయ చేసావే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే వీటిలో మజిలీ మాత్రం పెళ్లి తర్వాత నటించారు. ఇప్పటికీ ఈ సినిమా చూసి అభిమానులు ఇంత చక్కటి జంట.. ఎలా అయిపోయింది అని బాధపడుతుంటారు.

ఇక విడాకుల తర్వాత నాగచైతన్య, సమంత సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం సమంత బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో పాటు హాలీవుడ్ లో “ద అర్రెంజ్మెంట్స్ ఆఫ్ లవ్” అనే సినిమాలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో విజయ దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతుంది.

ఇటీవల విడుదలైన బంగార్రాజుతో చైతన్య అభిమానులను ఆకట్టుకోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన “కేఆర్ కే” తో సమంత అలరించింది. మరోవైపు నాగ చైతన్య కూడా రీసెంట్ గా అమీర్ ఖాన్ హీరోగా నటించిన “లాల్ సింగ్ చద్దా” సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

అయితే నాగ చైతన్యకు ఈ వెబ్ సిరీస్ లో నటించడం పెద్దగా ఇష్టం లేదట. హారర్, థ్రిల్లర్ సినిమాల్లో నటించాలనే ఆలోచన నాగ చైతన్యకు మొదటి నుంచి లేదు. కానీ అప్పట్లో సమంత పట్టుబట్టి నాగ చైతన్యతో ఆ వెబ్ సిరీస్ చేయాలని కోరింద‌ట‌. అలా స‌మంత కోరిక‌తోనే చైతూ ఈ వెబ్ సిరీస్ కు ఒప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం సమంత లేకపోయినా ఆమెకు న‌చ్చిన‌ పనులనే చైతూ చేస్తున్నాడంటే నెటిజ‌న్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.


End of Article

You may also like