సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకొని ఒక స్టార్ హీరో అవుతారు. ఆ స్టార్ హీరోలలో కొంత మంది కూడా అసలు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి హీరో మరొకరు రారు ఏమో అనే అంత గుర్తింపు తెచ్చుకుంటారు. ఆ తరం లో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు ఎంత స్టార్డాం తెచ్చుకున్నారో.. ఆ తర్వాత చిరంజీవి ఆ స్థానం లో ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో నెగెటివ్ పాత్రలు కూడా పోషించిన ఆయన.. ఒక్కసారి హీరోగా మారిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Video Advertisement

 

ఇన్నేళ్ల కెరీర్‌లో 150కి పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి.. ఒక కథను సులభంగా జడ్జ్ చేయగలడు. తనకున్న అనుభవంతో అందులోని లోటు పాట్లను గుర్తించి సవరించగలడు. అయినా ఇప్పటివరకు చిరు ఎందుకో దర్శకత్వం జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం పలువురు యంగ్ డైరెక్టర్స్ తో పని చేస్తున్న చిరు కొందరిపై బాహాటంగానే విమర్శలు కురిపించారు. అయితే ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం లో నటించారు. ఆ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

is chiranjeevi is ready to take megaphone on hand..

అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో చిరు సినిమా డైరెక్షన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మీకు దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా?’ అని చిరంజీవిని ప్రశ్నించగా… ”ఈ జీవితాంతం సినిమాతో మమేకం అవ్వాలని ఉంది. ఏదో ఒక సమయంలో ఆ సందర్భం వచ్చి… స్క్రిప్ట్‌పై నాకు నమ్మకముంటే, సినిమాను డీల్ చేయగలనని లేదా హ్యాండిల్ చేయగలనని నమ్మితే కచ్చితంగా డైరెక్షన్ చేస్తాను ” అని సమాధానం ఇచ్చారు. అయితే భవిష్యత్తులో మెగాస్టార్ మెగాఫోన్ చేయబట్టే అవకాశాలు లేకపోలేదు.

is chiranjeevi is ready to take megaphone on hand..

అయితే చిరు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతోంది. మాస్ మహారాజా రవితేజ మరో ప్రత్యేక కథానాయకుడిగా నటించిన చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి చెప్తూ.. ఇది ఫుల్ ప్యాకేజ్ లాంటి సినిమా అని, ఫ్యాన్స్‌కు పర్ఫెక్ట్ ట్రీట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు పిల్లలు ఈ సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారని.. సంక్రాంతి సీజన్‌‌కు మంచి సినిమా అవుతుందని ఆయన పేర్కొన్నారు.