సమ్మర్‌లో గుడ్లు తినకూడదా..? తింటే కలిగే సమస్యలు ఏమిటో తెలుసా?

సమ్మర్‌లో గుడ్లు తినకూడదా..? తింటే కలిగే సమస్యలు ఏమిటో తెలుసా?

by kavitha

Ads

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్లు, కాల్షియం లాంటి అనేక పోషకాలు అధికంగా ఉంటాయి. వాటి వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్లు రోజూ తీసుకోవడం ఆరోగ్యకరం. ఎముకలు దృఢంగా అవడానికి, కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది.

Video Advertisement

ఎండా కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని, ప్రతిరోజూ వీటిని తినాలని నిపుణులు చెబుతుంటారు. అందరు గుడ్డుతో రకరకాల వంటకాలను చేసుకుని తింటుంటారు. అయితే వేసవిలో అతిగా గుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో గుడ్ల వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం..వేడి పెరగడం:
ఎండా కాలంలో గుడ్లు తిన్నట్లయితే కడుపులో వేడి ఎక్కువగా పెరుగుతుంది. కోడి గుడ్లకు వేడి చేసే స్వబావం ఉండడం వల్లనే. వీటిని తినడం వల్ల బయటి వేడి, శరీరం లోపల వేడి కూడా పెరిగిపోతాయి. దాంతో కడుపులో  సమస్యలు మొదలవుతాయి. ఎసిడిటీ, కడుపులో మంట లాంటి సమస్యలు వస్తాయి. అందువల్ల  సమ్మర్ లో వీలు అయినంత వరకు కోడి గుడ్లకు దూరంగా ఉంటేనే మేలు.జీర్ణక్రియ పాడవడం:
ఎండా కాలంలో గుడ్లు తినడం ద్వారా జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ వేసవిలో గుడ్లు తినాల్సి వచ్చినపుడు ఎక్కువగా నీళ్లు తాగాలి.కిడ్నీల పై ప్రభావం:
వేసవిలో గుడ్లు తినడం ద్వారా మూత్రపిండాల పై కూడా దుష్ప్రభావం కలుగుతుంది. దానికి కారణం ఏమిటంటే కోడి గుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాల పై ప్రోటీన్ల జీర్ణం చేయడం కోసం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇక కిడ్నీ సమస్యలు ఇంతకుముందే ఉంటే గుడ్లు తినడం మానేయడం మంచిది. అంతేకాకుండా గుడ్లు పూర్తిగా ఉడకనట్లయితే, వాంతులు, కడుపు ఉబ్బరం, అజీర్ణానికి లాంటి సమస్యలు వస్తాయి. అందువల్ల గుడ్డును సరిగ్గా ఉడికించాలి.Also Read: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తీసుకుంటే పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి..

 


End of Article

You may also like