చైనా వస్తువులను “బ్యాన్” చేస్తే ఏం జరుగుతుంది.? ఈ 11 విషయాలు చూస్తే అసలు సాధ్యమేనా అని డౌట్ వస్తుంది!

చైనా వస్తువులను “బ్యాన్” చేస్తే ఏం జరుగుతుంది.? ఈ 11 విషయాలు చూస్తే అసలు సాధ్యమేనా అని డౌట్ వస్తుంది!

by Mohana Priya

Ads

ఈ మధ్య ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒక ట్రెండ్, చైనా ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయడం. భారతదేశం చైనా కి మధ్య జరిగిన గొడవలులో మన దేశ జవాన్లు ఎంతో మంది అమరవీరులయ్యారు. దీంతో చైనా వస్తువులని భారతదేశంలోకి రానీయకూడదు అని ఉద్యమం మొదలైంది. అంటే ఇకపై చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువులను బ్యాన్ చేయాలి అని అర్థం. సోషల్ మీడియాలో అయితే కొంతమంది తమ ఫోన్లని కింద పడేసి పగలగొట్టి చైనా అంటే తమకు అంత కోపం అని చెప్తున్నారు. వారికి నిజంగా చైనా మీద కోపమో లేదా పాపులర్ అవ్వాలని తాపత్రయమో వారికే తెలియాలి.

Video Advertisement

వాళ్ల సంగతి పక్కన పెడితే నిజం గా చైనా వస్తువులను అసలు వాడకుండా ఉండడం అనేది జరుగుతుందా? కచ్చితంగా జరగదు. ఎందుకంటే ఇప్పుడు కోపంలో ఏదో సోషల్ మీడియా అన్న ఆయుధం చేతిలో ఉంది కాబట్టి అందరూ చైనా ప్రొడక్ట్స్ ని రానివ్వద్దు అని ఒక మాట అయితే అనేస్తున్నారు. చైనా వస్తువుకి మరొక ప్రత్యామ్నాయం ఉంటే మన ఇండియాలో తయారైన వస్తువులనే ఉపయోగించడం మంచిది. లేదంటే ఆ వస్తువును మనం వాడకుండా ఉండటం మంచిది. మేడ్ ఇన్ ఇండియా వస్తువులు వాడడం మంచిదే, కానీ మనం నిత్యం ఉపయోగించే వస్తువుల్లో చైనా వస్తువుల పాత్ర ఎంత ఉందో మీరే చూడండి.

 

#1. భారతదేశంలో తయారైన వస్తువులు చైనాలో తయారైన వస్తువుల కంటే ఎక్కువ ఖరీదు ఉంటాయి. దాంతో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్లకి సరైన సౌకర్యాలు ఉండవు. సరే భారతీయ వస్తువులని తక్కువ ధర కి అమ్ముదాం అంటే డీలర్లు, వ్యాపారులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

 

#2. భారత దేశానికి చైనా నుండి దాదాపు 80 శాతం రోజు వారి వస్తువులు ఎగుమతి అవుతాయి. అంటే దాదాపు 100 బిలియన్ల వ్యాపారం అవుతుంది. భారతదేశం నుండి చైనా కి దాదాపు ఐదు బిలియన్ల ఖరీదు ఉండే వస్తువులు దిగుమతి అవుతాయి. అంటే ఇప్పుడు దాదాపు 95 బిలియన్ల తేడా ఉంది. ఇప్పుడు చైనాతో సంబంధాలు ఆపేస్తే నష్టం వచ్చేది ఎవరికి? భారతదేశ వ్యాపార రంగానికే.

 

#3. ఎలక్ట్రానిక్ పరికరాలు, మెడికల్ సామాగ్రి, బట్టలు, ట్రాన్స్పోర్టేషన్ పరికరాలు ఇలాంటివన్నీ దాదాపు చైనా నుండే వస్తాయి. ఇవన్నీ లేకుండా ఒకసారి మీ రోజు ని ఊహించుకోండి. వీటిలో ఏ ఒక్కటి అయినా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకుండా ఉండగలరా.

#4. ఒప్పో, వివో, లెనోవో, జియోని, రెడ్మీ ఇవన్నీ కూడా చైనా పరికరాలే. భారతదేశం యొక్క స్మార్ట్ఫోన్ రంగంలో 60 శాతం వరకు ప్రజలు వాడేది ఈ కంపెనీ వే. ఇప్పుడు ఇది చదువుతున్న పదిమందిలో దాదాపు ఏడుగురు ఇది కచ్చితంగా పైన చెప్పిన కంపెనీల్లో ఏదో ఒక కంపెనీ కి చెందిన ఫోన్ అయ్యి ఉంటుంది.

#5. భారత దేశానికి వెన్నెముక లాంటిది వ్యవసాయం. అలాంటి వ్యవసాయం యొక్క పరిస్థితి కూడా చైనా మీదే ఆధారపడి ఉంది. అవును. మొక్కల కి వాడే ఎరువు లో వాడే రసాయన పదార్థాలు కూడా చైనా నుండి ఉత్పత్తి అయ్యేవే.

 

#6. కరోనా కి మనం వాడే మాస్కులు కూడా చైనా నుండి వచ్చిన మెటీరియల్ తో తయారు చేసినవే. న్యూక్లియర్ రియాక్టర్ లో కోసం వాడే ఎలక్ట్రానిక్ డివైస్ లు, ట్రాన్స్ఫార్మర్లు, ఆర్గానిక్ కెమికల్స్, ఆసుపత్రులలో వాడే వెంటిలేటర్లు ఇవన్నీ కూడా డా చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువుల జాబితాలో ఉన్నాయి.

#7. ఎప్పుడైనా మీ బండి పాడయిందా? రిపేర్ చేయించుకొని పాడైన పార్ట్ ని మార్పించుకొని కొత్త పార్ట్ వేయించుకున్నారా? అయితే అది కచ్చితంగా గా చైనా వస్తువే అయి ఉంటుంది. మెకానిక్ షాప్ ల లో అయితే అవ్వచ్చు గాని షో రూమ్ లో బాగు చేయించుకుంటే కచ్చితంగా కంపెనీ పార్టే వేస్తాడు అని అనుకుంటున్నారా? ఆ కంపెనీకి ఆ పరికరాలు సప్లై చేసేది కూడా చైనానే. భారతదేశంలోని ప్రతి వాహనంలో కచ్చితంగా దాదాపు అన్ని పార్ట్లు చైనాకి చెందినవే.

#8. చైనా వస్తువుల్ని ఆపేస్తే నష్టపోయే రంగాల్లో వైద్య రంగం ఒకటి. ఎన్నో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు వాడే మందులు అన్ని చైనా నుండి వచ్చిన కెమికల్స్ తో తయారు చేసేవి. కాబట్టి చైనా నుండి దిగుమతి అయ్యే పదార్థాల్ని ఆపేస్తే ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

#9. చైనా మిగిలిన దేశాల కంటే తెలివిగా ఆలోచించి దాదాపు వాళ్ళు వాడే అన్ని వస్తువులు ఎక్కువశాతం వాళ్ల దగ్గరే ఉత్పత్తి అయ్యేలాగా ప్రణాళిక తయారు చేసింది. చైనా మీద ఆధారపడే దేశాల్లో భారతదేశం తో పాటు ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి.

#10. బొమ్మలు, కాస్మెటిక్స్, బ్యాగులు, లెదర్ వస్తువులు, ఫుట్వేర్, బట్టలు, యాక్సెసరీస్, నగలు, స్టీల్ సామాన్లు, స్పేర్ పార్టులు ఇలా ఎన్నో వస్తువుల్లో చైనా నుండి వచ్చిన మెటీరియల్ కచ్చితంగా కలుస్తుంది. అసలు ముందు చైనా వస్తువుల్ని ఆపాలి అంటే జనాలు వాటిని వాడటం ఆపాలి.

#11. కానీ ఒక్కసారి మనం వాడే వస్తువులు చూసుకుంటే కష్టమేమో అనిపిస్తుంది. సరే కొన్ని వస్తువుల సంగతి పక్కన పెడదాం. అంతగా ఏమైనా కావాలి అంటే ఆన్లైన్ నుండి తెప్పించుకుందాం. మీలో కొంతమందికైనా ఈ ఆలోచన వచ్చే ఉంటుంది. కానీ మీకు ఒకటి తెలుసా? భారత దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్న ఫ్లిప్కార్ట్ కూడా చైనా కు సంబంధించినదే. ఇవే కాకుండా మీడియం స్కేల్, లో స్కేల్ వ్యాపారాలు కూడా నష్టపోతాయి.

 

ఎంతోమంది జనాల్లో ఉన్న నటనా ప్రతిభని బయటికి తెచ్చి వాళ్లని స్టార్లని అదే సోషల్ మీడియా స్టార్లని చేసిన టిక్ టాక్ కూడా చైనాదే. చైనా వస్తువులు ఆపేయడం అంటే ఫోన్ లో ఉన్న చైనా యాప్ లని తీసేయడం కాదు. అలాగే వాడుతున్న ఫోన్ కింద పడేయడం కూడా కాదు. పైన చెప్పిన వన్ని వాడకుండా ఆపేయడం.

కాబట్టి ఒక్కసారి ఆలోచించండి… ఇప్పుడు మీకు కూడా అనిపిస్తుంది ఇదంతా కష్టమే కాదు అసలు జరగని పని ఏమో అని. దీన్నే రియాలిటీ చెక్ అంటారు. కాబట్టి  చైనా వస్తువుల బదులు అన్నీ మనదేశంలో దొరికేలా ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఉంటే తప్ప నిజంగా చైనా జోక్యం లేకుండా మన రోజు గడవటం అనేది సాధ్యం కాని పనే అనుకుంట.


End of Article

You may also like