పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం దేనికి సంకేతమో తెలుసా? ఏమైనా కీడు జరుగుతుందా?

పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం దేనికి సంకేతమో తెలుసా? ఏమైనా కీడు జరుగుతుందా?

by Megha Varna

Ads

సాధారణంగా నిద్ర వచ్చినప్పుడు కానీ, బాగా అలసిపోయినప్పుడు గాని ఆవలింతలు వస్తాయి. మరి పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం దేనికి సంకేతం అనేది ఇప్పుడు చూద్దాం. కొంతమంది పూజ చేసేటప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి. దీని వెనుక చాలా అభిప్రాయాలు వున్నాయి. కొందరు వారిలో ఉండే శక్తులు పోతాయని నమ్ముతారు. మరి కొందరైతే వారి దృష్టి మళ్లుతోంది అంటారు. ఇంకొందరు మత్తులో పడిపోతున్నాం అని భావిస్తారు. కానీ ఇలా ఆవలింతలు వచ్చినప్పుడు తిరిగి దృష్టిని మార్చుకుని పూజ చేస్తూ ఉంటాం.

Video Advertisement

ఎక్కువగా జపాలు చేసేవారికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోయి ఉంటుంది. అలా అని మనం పాపం చేసినట్టు కాదు. ఎందుకంటే కావాలని ఎవరు కూడా కుళ్ళిన కొబ్బరికాయ కొట్టరు కదా. అదే విధంగా ఎప్పుడైతే శ్రద్ధగా పూజ చేస్తున్నామో చాలా ప్రశాంతంగా మనం భావిస్తాము. అందువల్లనే ఆవలింతలు వస్తూ ఉంటాయి. చాలా మందికి ఆవలింతలు రావు అని కూడా మనం గమనించాలి.

చాలా మందికి పురాణాలు వింటున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు మరియు మొదలగు దైవ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు నిద్ర వస్తుంది. అంతే కానీ చెడ్డ పనులు చేస్తున్నప్పుడు నిద్ర రాదు. దానికి కారణం ఏమిటంటే దైవ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు భగవంతుని దీవెనలు మీపై పడుతున్నాయి అని అర్థం మరియు అందువల్లనే ఆ స్థితిలో ఉంటున్నారు అని పెద్దలు చెబుతారు.

అంతేకాక త్యాగరాజులు కూడా ఇదే మనకు తెలియజేశారు, ఎప్పుడైతే శాంతా భావం మనలో ఉంటుందో అప్పుడే ఆవలింతలు వస్తాయని పైగా తిరిగి మనం దైవం పూజ చేస్తున్నప్పుడు చేయడం వల్ల ఎటువంటి కీడు లేదు అని అన్నారు. కాబట్టి పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం వల్ల ఎటువంటి దోషాలు మీకు ఉండవు.


End of Article

You may also like