సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా తెలుగు, మలయాళంలోనే హిట్ అవుతుందనుకుంటే, మొత్తం దేశాన్నే షేక్‌ చేసింది ఈ సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” పైన అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.

Video Advertisement

 

ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది. అయితే ఈ చిత్రం లో కీలక పాత్రల కోసం పలువురు స్టార్ నటులను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం లో పలు కీలక పాత్రల కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సాయి పల్లవిలను పుష్ప చిత్ర బృందం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ లిస్ట్ లో మరో సీనియర్ నటుడి పేరు కూడా చేరింది.

is jagapathi babu plays a role in pushpa 2..??

సుకుమార్ తీసిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించిన జగపతిబాబు కూడా తాజాగా పుష్ప 2 లో చేరినట్లు తెలుస్తోంది. పుష్ప 1లో ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు కానీ పార్ట్ 2 లో ఫవాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్ తో పాటు మరో బలమైన విలన్ ఉండాలని జగపతి బాబుని కూడా దించుతున్నాడట సుకుమార్. ఈ చిత్రం లో జగపతి బాబు ఒక రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంతకు ముందు ఈ పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతి పేరు వినిపించింది కానీ ప్రస్తుతం జగపతిబాబు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.

is jagapathi babu plays a role in pushpa 2..??

అయితే తన సినిమాల్లో నటుల్ని ఎక్కువగా రిపీట్ చేయని సుకుమార్ ఈ చిత్రం తో జగపతిబాబు కి హ్యాట్రిక్ ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాల్లోని పాత్రల ద్వారా జగపతిబాబు కి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి హీరోయిన్ రష్మిక షూటింగ్ లో పాల్గొననున్నట్లు ఇటీవల వెల్లడించింది. అలాగే ఈ చిత్రం లో సాయి పల్లవి కూడా నటించనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.