సినీ నిర్మాత, నటుడు, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూనే జబర్ధస్త్ షోలో చాలా కాలంపాటు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే నాగబాబు.. మెగా ఫ్యామిలీపై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని తిప్పికొట్టడంలో ముందుంటారు.
Video Advertisement
అయితే జబర్దస్త్ అంటే నాగబాబు.. నాగబాబు అంటే జబర్దస్త్ అనేలా ఉండేది ఒకప్పుడు. ఈటీవీలో, మల్లెమాల వాళ్లు చేసే ప్రతి ఈవెంట్‌కు ఆయన కచ్చితంగా చీఫ్ గెస్ట్. అలా కొన్నేళ్లపాటు సాగింది. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ.. ఆయన ఈటీవీ నుండి దూరమయ్యారు. జీటీవీ, మాటీవీ, యూట్యూబ్ అంటూ ఏవేవో షోలు చేశారు. అయితే జబర్దస్త్‌లో ఆయన ప్లేస్ మాత్రం ఎవరూ ఫిలప్ చేయలేదు. అలాగే నాగబాబు లైఫ్‌లో జబర్దస్త్ లాంటి షో ఇంకొటి రాలేదు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నాగబాబు జబర్దస్త్ షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
జబర్దస్త్ కార్యక్రమం నుండి దూరంగా వెళ్లడడం గురించి మాట్లాడుతూ.. జబర్దస్త్‌కి తనకూ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మల్లెమాల – ఈటీవీ వాళ్లు మళ్లీ ఆహ్వానిస్తే తప్పకుండా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారట నాగబాబు.
జబర్దస్త్ షో కుర్రాళ్లు వచ్చి నన్ను జబర్దస్త్ కు రావాలని అడిగారని ఆయన తెలిపారు. ఇతర షోలు చెయ్యడం లేదు కాబట్టి మళ్లీ వస్తానని చెప్పానని, మల్లెమాల, ఈటీవీ వాళ్ళు ఒప్పుకుంటే వస్తానని అన్నారు. తనకు ఏ విధమైన ఇగో లేదని ఆయన వివరించారు. దీంతో నాగబాబు తిరిగి రావడానికి సిద్దం గా ఉన్నానంటూ హింట్ ఇచ్చారా.. ఈటీవీ వాళ్ళు దీని గురించి ఆలోచిస్తారా.. లేదా.. అన్నది చూడాలి.