‘గబ్బర్‌ సింగ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్ లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రం రాబోతుంది. తొలుత ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ టైటిల్‌ను ప్రకటించారు. తాజాగా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’గా టైటిల్‌ మార్చి తాజాగా పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ మొదలుపెట్టారు. కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆ పేరుని మార్చి పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

Video Advertisement

అయితే ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూస్తుంటే.. అంతకు ముందు ప్రకటించిన “భవదీయుడు..” పోస్టర్ కి వేరే సినిమా పోస్టర్ కలిపి ఇచ్చినట్టు అనిపించింది. అయితే ఈ పోస్టర్ మాత్రమే కాదు. సినిమా కూడా రెండు కథలను మిక్స్ చేసే తీస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో ఈ సారి స్ట్రెయిట్ మూవీ వస్తే బావుంటుందని అభిమానులు భావించారు. కానీ ఇది కూడా రీమేక్ అని తెలుస్తోంది.

is pavan-harish again doing a remake movie..

వరుస రీమేక్స్ లో నటిస్తున్న పవన్.. ” భవదీయుడు భగత్ సింగ్” కథ ని పక్కన పెట్టి.. విజయ్ హీరోగా వచ్చిన ‘తేరి’ రీమేక్ స్టోరీ లో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఇప్పటికే తెలుగులో కూడా ‘పోలీసోడు’ పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ వార్తలు వచ్చినప్పటి నుంచి పవన్ అభిమానులు రీమేక్స్ వద్దంటూ పెద్ద ఎత్తున ట్రెండింగ్ స్టార్ట్ చేసారు. కానీ ‘ ఉస్తాద్ భగత్ సింగ్’ క్లాప్ బోర్డు మీద ..’ రచన – దర్శకత్వం’: హరీష్ శంకర్ అని కనిపించే సరికి ఇది రీమేక్ అని తేలిపోయింది.

is pavan-harish again doing a remake movie..

త్రివిక్రమ్ సూచనల మేరకు ‘తేరి’ కథ లోని ఫస్ట్ హాఫ్ ని తీసుకొని.. ‘ భవదీయుడు భగత్ సింగ్ ‘ కథకు కలిపి ఈ సినిమా చేయనున్నారు. ‘దబంగ్‌’ సినిమాను ‘గబ్బర్‌ సింగ్‌’గా మార్చిన తరహాలోనే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ కోసం మార్పులు చేశారట హరీశ్‌ శంకర్‌. కానీ దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ.. ‘పవన్- హరీష్ శంకర్’ కాంబినేషన్ లో రాబోతున్న తదుపరి చిత్రం రీమేక్ అని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు.