‘గబ్బర్‌ సింగ్‌’తో వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్ లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రం రాబోతుంది. తొలుత ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ టైటిల్‌ను ప్రకటించారు. తాజాగా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’గా టైటిల్‌ మార్చి ఆదివారం పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ మొదలుపెట్టారు. కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆ పేరుని మార్చినట్లు తెలుస్తోంది.

Video Advertisement

అయితే ఈ మూవీ లాంచ్ కి ముందు పవన్ – హరీష్ శంకర్ తమిళం లో వచ్చిన ‘ తేరి’ మూవీ రీమేక్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ చిత్రం తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో డబ్ అయ్యింది. దీంతో పవన్ ఫాన్స్ ఈ వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే పవన్ చాలా రీమేక్స్ చేసాడు. ఇంకా ఎందుకు రీమేక్స్..?? పవన్ ఇమేజ్ కి సరిపడే కథలే లేవా.. అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్, మీమ్స్ వైరల్ అయ్యాయి.

is pavan - harish new movie mixing of that two stories..!!

గతంలో సల్మాన్ నటించిన ‘దబాంగ్’ మూవీకి తెలుగు రీమేక్‌గా పవన్‌ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ సినిమా రూపొందించాడు హరీష్ శంకర్. ఒరిజినల్ మూవీలోని థీమ్ మాత్రమే తీసుకుని పవన్ బాడీ లాంగ్వేజ్‌కు సూట్ అయ్యేలా పూర్తిగా కొత్త స్క్రిప్ట్‌‌తో ఆ సినిమా తెరకెక్కించాడు. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ పవన్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్న హరీష్.. ఈసారి సొంతంగా తయారుచేసుకున్న పవర్‌ఫుల్ స్టోరీతో సినిమా తీయాలనుకున్నాడు. పవన్‌కు కూడా హరీష్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనౌన్స్ చేశారు.

is pavan - harish new movie mixing of that two stories..!!

అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఎప్పపటి నుంచో వెయిటింగ్‌లో ఉన్న హరీష్ సినిమాకు మోక్షం కలగలేదు. ఈ క్రమంలోనే సేఫ్‌గా హరీష్‌ ‘తేరి’ రీమేక్ చేస్తున్నట్లు నెట్టింట న్యూస్ వినిపించింది. కానీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలోనే విజయ్ నటించిన ‘తేరి’ మూవీలోని ఎమోషనల్ అవుట్‌లైన్ తీసుకుని.. దాన్ని భవదీయుడు స్టోరీలో కలపాల్సిందిగా పవన్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో హరీష్.. పవన్ చెప్పినట్లుగానే తన కథకు ‘తేరి’ అవుట్‌లైన్ యాడ్ చేసి ఈ స్టోరీ సిద్ధం చేసినట్లు సమాచారం.