Ads
తమ అభిమాన హీరో పుట్టినరోజు లేదా సినిమా రిలీజ్ రోజు సందర్భంగా ఫ్యాన్స్ స్పెషల్ షోలు వేయడం అనేది ఈమధ్య ఓ ట్రెండ్‌లా మారిపోయింది. ఇటీవల మహేష్, పవన్ పుట్టిన రోజులకు ఇలా చేసారు. ఫ్యాన్స్ కూడా రీ రిలీజ్ ల విషయంలో ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలా బెంచ్ మార్క్ ఇయర్స్‌కి, ఏదో ఒక అకేషన్ చూసుకుని… ట్రెండ్ మార్క్ మూవీస్ ను మళ్లీ థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు.
Video Advertisement
అలాగే రీ రిలీజ్ లతో వచ్చే డబ్బుని ట్రస్ట్ లకు వంటి వాటికి దానం చేస్తామని విడుదల చేసే ముందు చిత్ర బృందాలు చెబుతున్నాయి. తమ హీరో పేరు చెప్పుకుని ట్రస్ట్ కు డబ్బులు దానం చేస్తున్నాము అనే ఫీలింగ్ తో అభిమానులు కూడా టికెట్ లు తెగ కొనేస్తున్నారు. అయితే ఓ సినిమాని రీ రిలీజ్ చేసే ముందు .. ఆ చిత్ర బృందాలు ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
అసలు విడుదల చేయాలి అనుకున్న సినిమాలో ఫ్యాన్స్ స్టఫ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. అంతే కాకుండా ప్లాప్ మూవీస్ ని కూడా రీ రిలీజ్ లు చెయ్యడం ప్రారంభించారు. దీంతో ఆ హీరోల రానున్న సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయని అభిమానులు భావిస్తున్నారు. పాత తరం నాటి హీరోల సినిమాలను రీ రిలీజ్ చేయడం లో అర్థం ఉంది కానీ.. ప్రస్తుతం ఉన్న హీరోల సినిమాలు ఆపేయాలని ఫాన్స్ కోరుతున్నారు.
ఇటీవల ప్రభాస్ బర్త్డే కి ‘రెబల్’ సినిమాని రీ రిలీజ్ చేశారు. అది ప్లాప్ మూవీ.. అలాగే బిల్లా ని కూడా రీ రిలీజ్ చేసారు. తాజాగా రజనీకాంత్ నటించిన ‘బాబా’ సినిమాని క్లైమాక్స్ మార్చి రీ రిలీజ్ చేసారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’, టబు, వినీత్, అబ్బాస్ నటించిన ‘ప్రేమ దేశం’ చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. దీంతో ఆయా నటుల ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా రీ రిలీజ్ చేసే ముందు మేకర్స్ ఇవి గుర్తుంచుకుంటే బెటర్ అని ఫాన్స్ అనుకుంటున్నారు.
End of Article