Ads
స్వీట్స్ అంటే ఇష్టం లేని వారు ఉండటం చాలా అరుదు. ప్రతి ఒక్క మనిషికి అన్ని రకాల స్వీట్స్ కాకపోయినా కూడా ఏవో కొన్ని అయినా నచ్చుతాయి. ఎలాంటి సందర్భం అయినా, ఎలాంటి మెనూ అయినా స్వీట్ లేనిదే పూర్తి కాదు. అందుకే స్వీట్స్ కి ఇప్పటికి కూడా అంత డిమాండ్ ఉంది. అసలు ఇప్పుడే కాదు స్వీట్స్ కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.
Video Advertisement
బయట స్వీట్ షాప్స్ లో తయారు చేసే స్వీట్లకి ఇంకొక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా స్వీట్ షాప్స్ లో స్వీట్ మీద సిల్వర్ కోటింగ్ చేసి ఇస్తారు. దీనివల్ల స్వీట్ రుచి ఇంకా బాగుంటుంది. స్వీట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కానీ గత కొంత కాలం నుండి స్వీట్స్ పై సిల్వర్ కోటింగ్ వేయడానికి వెండిని వాడటం లేదు. అల్యూమినియం లేదా అంతగా ప్యూరిఫై చేయని వెండిని వాడుతున్నారు.
దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు పరిశోధకులు. స్వీట్ల పై వాడే వెండి రంగులో ఉండే కోటింగ్ ని స్లాటర్ హౌస్ (కబేళాలు) లోని ఎద్దు లేదా దూడ పేగుల నుండి తయారు చేస్తారు. అలా తయారు చేసిన దాన్ని తర్వాత మ్యానుఫ్యాక్చర్ లకి ఇస్తారు. అందులో వాళ్ళు చాలా తక్కువ మొత్తంలో వెండి కలుపుతారు. దానిని పల్చటి షీట్ లాగా వచ్చేలాగా చేస్తారు. ఎంత శుభ్రపరిచినా కూడా షీట్ లపై మాంసం, ఇంకా రక్తానికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడో ఒక చోట ఉంటాయి.
స్వీట్స్ మీద ఉన్న సిల్వర్ ఫాయిల్ నిజమైనదా కాదా తెలుసుకోవడానికి ఈ టెక్నిక్స్ పాటించాలి.
# పల్చటి సిల్వర్ షీట్ తీసుకొని రెండు చేతుల మధ్య లో పెట్టి రుద్దండి. ఒకవేళ అది నిజమైన వెండి అయితే రుద్దిన తర్వాత ఆనవాళ్ళు ఏమీ ఉండవు. అదే ఒకవేళ పైన చెప్పిన పద్ధతిలో తయారు చేసిన అల్యూమినియం అయితే రుద్దిన తర్వాత చిన్న బాల్ లాగా అవుతుంది.
# సిల్వర్ షీట్ ని మంటపై పెట్టండి. ఒకవేళ అది నిజమైన వెండి అయితే పూర్తిగా కాలిపోతుంది. ఒకవేళ కాకపోతే బూడిద లాగా ఏర్పడుతుంది.
# స్వీట్ పైన సిల్వర్ కోటింగ్ ని చేతితో తుడవండి. ఒకవేళ చేతికి అంటుకుంటే అది అల్యూమినియం అని అర్థం.
# సిల్వర్ రేకుని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకోండి. అందులో డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపండి. వైట్ ప్రెసిపిటేట్ వచ్చి లిక్విడ్ లాంటి పదార్థం ఏర్పడితే అది వెండి అని అర్థం. ఒకవేళ అల్యూమినియం అయితే ప్రెసిపిటేట్, కానీ లిక్విడ్ కానీ ఏర్పడదు.
End of Article