సినిమా రంగం సెంటిమెంట్లకు నిలయం. ఆ సెంటిమెంట్ ఒకటని చెప్పలేం. అనేక రకాల సెంటిమెంట్లు రాజ్యమేలుతున్నాయి. వారాలు – తేదీలు – నెలలు – పండుగలు-కాంబినేషన్లు…..ఇలా అనేక సెంటిమెంట్లు ఎక్కువ మంది నమ్ముతారు. ముఖ్యంగా టాలీవుడ్లో హీరోలు ఎక్కువగా సెంటిమెంట్లను ఫాలో అవుతారని చెబుతుంటారు. అందరికీ ఉన్నట్లే మెగా ఫ్యామిలికి చెందిన హీరోలకు కూడా సెంటిమెంట్లపై చాలా నమ్మకం ఉందని అంటున్నారు.
Video Advertisement
సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలో అయినా కొన్ని సెంటిమెంట్లు కొందరికి కలిసి వస్తాయి. మరికొందరికి బ్యాడ్ సెంటిమెంట్లుగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి మెగా ఫ్యామిలీని బాగా భయపెడుతూ వస్తోంది. ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో బాగా చర్చకి వస్తోంది. ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏదో కాదు.. మెగా ఫ్యామిలీకి సీక్వెల్స్ కలిసి రావట్లేదు అని.
అవును నిజమే.. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ లో వచ్చిన సీక్వెల్స్ అన్ని ప్లాప్ అయ్యాయి. చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబియస్ చిత్రానికి సీక్వెల్ గా శంకర్ దాదా జిందాబాద్ వచ్చింది. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. తర్వాత అల్లు అర్జున్ ఆర్య తర్వాత చేసిన ఆర్య 2 చిత్రం కూడా యావరేజ్ గా నిలిచింది. అలాగే గబ్బర్ సింగ్ సూపర్ అయిన తర్వాత పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేయగా అది కూడా ప్లాప్ అయ్యింది.
దీంతో ఇప్పుడు ఈ సెంటిమెంట్ మెగా ఫాన్స్ ని వెంటాడుతోంది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప: ది రైజ్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దీనికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. పుష్ప: ది రూలర్. ఇప్పుడు ఈ చిత్రం మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ ని దాటి హిట్ అవుతుందా .. లేదా అని మెగా ఫాన్స్ కంగారు పడుతున్నారు. సినిమా హిట్ అయితే పర్లేదు కానీ ఈ సినిమాతో కూడా మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అని మెగా ఫాన్స్ చర్చించుకుంటున్నారు.